మోడీ గవర్నమెంట్ అప్పుల మాఫీ ప్రభుత్వమా..?

Update: 2021-11-21 11:35 GMT
దేశంలో వ‌రుస‌గా రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన న‌రేంద్ర‌మోడీ ప్ర‌భుత్వం తీరు క్ర‌మ‌క్ర‌మంగా మారుతోంది. మోడీ కార్పోరేట్ల‌కు ప‌ట్టం క‌డుతున్నార‌ని.. సామాన్య ప్ర‌జ‌ల న‌డ్డి విరుస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. నార్త్‌లో నెల‌ల త‌ర‌బ‌డి రైతులు త‌మ‌కు వ్య‌తిరేకంగా ఉన్న చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని ఉద్య‌మిస్తున్నారు. ఈ ఉద్య‌మంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయినా మోడీ మ‌న‌సు క‌ర‌గ‌లేదు.

అయితే వ‌చ్చే యేడాది నార్త్‌లో యూపీతో పాటు పంజాబ్‌లో ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డం.. అక్కడ బీజేపీకి వ్య‌తిరేక గాలులు వీస్తున్నాయ‌న్న నివేదిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న వెన‌క్కు దిగారు. మూడు రైతు చ‌ట్టాల‌ను వెన‌క్కు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు. రైతు చ‌ట్టాలు మాత్ర‌మే కాదు.. మోడీ తీసుకుంటోన్న ఎన్నో నిర్ణ‌యాలు పారిశ్రామిక‌వేత్త‌లు, కుబేరుల‌కు అనుకూలంగా ఉంటున్నాయ‌న్న విమ‌ర్శ‌లు తీవ్రంగా ఉన్నాయి.

చివ‌ర‌కు మోడీ ప్ర‌భుత్వం ఎలా దిగ‌జారింది అంటే భార‌త‌దేశ పేద ప్ర‌జ‌ల సంప‌ద‌ను దోచుకుని ప్ర‌భుత్వానికి ప‌న్నులు, బ్యాంకుల‌కు రుణాలు ఎగ‌నామం పెడుతోన్న బ‌డా బ‌డా పారిశ్రామిక‌వేత్త‌ల రుణాలు మాఫీ చేసే స్థాయికి వ‌చ్చేసింది. దీనిని బ‌ట్టి మోడీ ప్ర‌భుత్వంలో సామాన్యుల‌కు లాభ‌మా ? రుణాలు ఎగ‌వేసే బ‌డా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు లాభ‌మా ? అన్న‌ది దేశ ప్ర‌జ‌లే తేల్చుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది.

ఇక మోడీ ప్ర‌భుత్వం హ‌యాంలో రు. 8 ల‌క్ష‌ల కోట్ల అప్పుల‌ను బ్యాంకులు మాఫీ చేయ‌డంపై దేశ వ్యాప్తంగా ఎన్నో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. 2015-19 సంవ‌త్స‌రాల మ‌ధ్య 7,94,354 కోట్ల రుణాలు బ్యాంకులు మాఫీ చేశాయి. పూణేకు చెందిన ఓ వ్య‌క్తి నిర‌ర్ధ‌క అప్పుల‌పై స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద వివ‌రాలు కోర‌డంతో ఇవ‌న్నీ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే ఈ విష‌యంలో గ‌త యూపీఏ ప్ర‌భుత్వం కూడా త‌క్కువ తిన‌లేదు.

2004-2014 మ‌ధ్య ప‌దేళ్ల యూపీయే పాల‌న‌లో 2,20,328 కోట్ల అప్పులు మాఫీ చేశారు. మ‌రీ యూపీయే ప్ర‌భుత్వ‌మే ఇన్ని అప్పులు మాఫీ చేస్తే మేం అంత‌క‌న్నా ఎక్కువే అంటూ అప్ప‌టి అప్పుల‌తో పోలిస్తే ఏకంగా మూడు రెట్ల ఎక్కువ అప్పులు ఎన్డీయే ప్ర‌భుత్వం మాఫీ చేసింది. ఇక్క‌డ అప్పులు మాఫీ చేయించుకున్న బ‌డా దొంగ‌లు అంతా ఎంచ‌క్కా విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారు.
Tags:    

Similar News