వల్లభనేని వంశీకి సీటు లేదా...?

Update: 2022-09-07 13:30 GMT
జంపింగ్ కింగ్ అయిన వల్లభనేని వంశీకి జగన్ షాక్ ఇవ్వబోతోతున్నాడా.  వైసీపీలో ఇపుడు ఇదే చర్చగా ఉంది అని అంటున్నారు. దీనికి కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీ తరఫున ఎన్నికల వ్యూహరచన చేస్తున్న ప్రశాంత్ కిశోర్ టీం వల్లభనేని వంశీకి టికెట్ ఇవ్వవద్దు అని  గట్టిగానే  సూచిస్తోంది అనే ప్రచారం వినిపిస్తుంది . ఆ ప్రచారం ఏంటి అంటే ఒకవేళ వల్లభనేని వంశీకి కనుక టికెట్ ఇస్తే ఆ ప్రభావం మొత్తానికి మొత్తం ఉమ్మడి క్రిష్ణా జిల్లా మీద పడుతుంది అని పీకే టీం తేల్చిందంట.

ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబు కుటుంబ మహిళల మీద వంశీ అప్పట్లో అనవసరమైన కామెంట్స్ చేశారు అన్నది జనంలోకి బలంగా వెళ్ళిపోయింది అన్నదే పీకే టీం మార్క్ నివేదిక అంటున్నారు. ఇక వల్లభనేని వంశీ ఆనాడు అన్న మాటలను, చంద్రబాబు కుటుంబ సభ్యుల మీద చేసిన అనుచితమైన కామెంట్స్ మీద వీడియోలు ఉన్నాయి. వాటిని టీడీపీ వచ్చే ఎన్నికల్లో చాలా విస్తృతంగా ప్రచారంలోకి తేవడం ఖాయమని కూడా పీకే టీం అంచనా వేస్తోందిట.

అదే కనుక జరిగితే వైసీపీకి టోకున అతి పెద్ద దెబ్బ తగులుతుంది అని అంటున్నారు. ఇది సున్నితమైన అంశం కావడంతో మహిళా ఓట్లు కూడా పూర్తిగా వైసీపీకి జారిపోయే ప్రమాదం ఉంది అన్నదే ప్రశాంత్ కిశోర్ టీం వాదనగా ఉంది అని అంటున్నారు. వల్లభనేని వంశీని మావాడు అని వైసీపీ భుజానికి ఎత్తుకుని ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల ఇంతటి ఉపద్రవం చెలరేగే అవకాశం ఉంది అని అంటున్నారు.

నిజానికి పీకే టీం చెప్పినది కూడా కరెక్ట్ అనే అంటున్నారు. వంశీ అనుచితమైన కామెంట్స్ ని ఎవరూ సమర్ధించరు. పైగా అప్పట్లో వైసీపీ నేతలు కొందరు కూడా ఇదే విషయం మీద మాట్లాడుతూ వంశీ మా పార్టీకి చెందిన వారు కానే  కారు అనేశారు కూడా. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వంశీ అన్న మాటలకు మాకేంటి సంబంధం అని కూడా అన్నారు. అంటే వంశీ అనుచితంగా మాట్లాడిన వాటికి వైసీపీ ఏ విధంగా బాధ్యత వహించాలి అన్నది ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న చర్చ.

అయితే టెక్నికల్ గా వంశీ టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన వైసీపీతో అంటకాగడంతోనే ఈ నిందలు, విమర్శలు అన్నీ కూడా వైసీపీ మోయాల్సి వస్తోంది. అలాంటిది రేపటి రోజుల ఏకంగా ఆయనను పిలిచి మరీ టికెట్ ఇస్తే కచ్చితంగా వంశీని సొంతం చేసుకున్నట్లుగా అవుతుంది. అదే టైం లో ఆయన చేసిన కామెంట్స్ కి ఇపుడు పార్టీ పరంగా వైసీపీ కచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుంది.

దాంతో అధికార పార్టీ పూర్తిగా ఇరకాటంలో పడాల్సి ఉంటుంది. ఒక విధంగా వంశీని ముందు పెట్టుకుని వైసీపీ వెళ్తే తెలుగుదేశానికి అది రాజకీయ ఆయుధం ఇచ్చినట్లే అవుతుంది. దాంతో వైసీపీని కార్నర్ చేయడానికి ఆ పార్టీ సిద్ధంగా ఉంటుంది. ఎన్నికల రాజకీయాల్లఒ సానుభూతి పాలిటిక్స్ లో ఆరితేరిన టీడీపీకి ఇది అందివచ్చిన చాన్స్ అవుతుంది.

మరి ఆ చాన్స్ ఇవ్వకుండా ఉండాలంటే కచ్చితంగా వంశీని పక్కన పెట్టడమే బెటర్. మరి పీకే టీం సూచనను వైసీపీ హై కమాండ్ పరిగణనలోకి తీసుకుని వంశీకి టికెట్ ఇవ్వదా. లేక వంశీకి జగన్ ఇచ్చిన మాట ప్రకారం టికెట్ ఇచ్చి  టీడీపీకి చాన్స్ ఇస్తుందా. ఏది ఏమైనా ఎన్నికల్లో గెలుపే ప్రధానం అని వెళ్తున్న వైసీపీ ఈ విషయంలో ఎలాంటి రిస్క్ చేయదనే అంటున్నారు



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News