ఎంపీని అరెస్టుచేయటం ఖాయమేనా?

Update: 2022-06-23 08:30 GMT
వైసీపీ నరసరావుపేట తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు భయం చూస్తుంటే అందరికీ అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాను రాష్ట్రంలోకి అడుగుపెట్టగానే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడానికి పోలీసులు కాచుకుని కూర్చున్నట్లు ఆందోళన వ్యక్తంచేశారు. అందుకనే పోలీసులు తన జోలికి రాకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్, హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాను కలిసి రిక్వెస్టు చేసుకున్నారు.

వచ్చే నెల 4వ తేదీన నరసాపురం నియోజకవర్గంలో నరేంద్ర మోడీ పర్యటించబోతున్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని విగ్రహం ప్రతిష్ట జరుగుతోంది.

ప్రధాని తన నియోజకవర్గంలో పర్యటించేటపుడు తాను పక్కనే ఉండాలన్నది రాజు కోరిక. కానీ ఏపిలోకి అడుగుపెడితే తాను క్షేమంగా తిరిగి ఢిల్లీకి వెళతాననే నమ్మకం రాజులో లేదు. అందుకనే హోంశాఖ మంత్రి, కార్యదర్శిని కలుసుకుని తనను అరెస్టు చేయద్దని ఆదేశాలివ్వాలంటు  కోరారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనపై కేసులు పెట్టి అరెస్టు చేస్తారనే ఎంపీ భయానికి ఆధారాలు ఏమిటో తెలీదు. ఆయన కూడా ఫలానా కారణమని ఏమీ చెప్పటంలేదు. పోలీసులు కేసులు పెడతారని, అరెస్టు చేస్తారని ఊరికే చెప్పేస్తున్నారు.

నిజానికి ఇంత భయపడుతున్న ఎంపీ నియోజకవర్గానికి రాకపోతే ఏమవుతుంది ? ప్రధాని వచ్చినపుడు ఎంపీ హాజరవ్వాలన్న ప్రోటోకాల్ ఏమీ లేదు. హాజరుకాకపోయినా పట్టించుకునే వారెవరూ లేరు. కాకపోతే ప్రధాని వచ్చినపుడు పక్కనుండాలని అనుకోవటంలో తప్పులేదు.

ఎలాగూ బీజేపీ అగ్రనేతలతో ఎంపీకి దగ్గర సంబంధాలే ఉన్నాయి. నియోజకవర్గంలో పర్యటించే విషయంలో వాళ్ళని వీళ్ళని బతిమలాడుకునే బదులు నరేంద్ర మోడితో మాట్లాడుకుని ప్రధానితోనే వచ్చి మళ్ళీ ప్రధానితోనే తిరిగి వెళ్ళిపోవచ్చు కదా. ఆ అవకాశాన్ని వదిలిపెట్టేసి ప్రతిరోజు ప్రభుత్వంపై బురద చల్లేసే కార్యక్రమమే చేస్తున్నారు. ప్రతి రోజు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సర్కారు తప్పులను విశ్లేషిస్తు వివరిస్తున్నారు. మరి అలాంటపుడు ఇంత భయమెందుకు రాజుగారికి.
Tags:    

Similar News