రాజకీయాలంటే వ్యూహ ప్రతివ్యూహాలు.. ఎన్నికలు వస్తే వీటికి మరింత పదును పెరుగుతుంది. అందులోనూ మునుగోడులాంటి ఉప ఎన్నిక వస్తే వాటికి ఇక అంతే ఉండదు. ప్రతిష్ఠాత్మకంగా
మారి.. భావి రాజకీయ ప్రయాణాన్ని నిర్దేశించే మునుగోడు ఉప ఎన్నికను తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.
సరిగ్గా ఉప ఎన్నిక పోలింగ్ వారం రోజులు ఉందనగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నం సాగించిందన్న సంచలన అంశం బయటకు వచ్చింది. హైదరాబాద్ శివారు మొయినాబాద్ లోని ఫాంహౌస్ కేంద్రంగా సాగినట్లుగా చెబుతున్న ఈ బేరం'సారం'ఏమిటో పూర్తిగా తెలియాల్సి ఉంది. అటు దీనిపై సీఎం కేసీఆర్, ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్లు పెడతారని అంటున్నారు.అందులో ఏం చెబుతారో..? వాటి తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం..
ఎన్నికల ముందు కాక ఇలా పెరుగుతుందనుకోలే.. మునుగోడో ఉప ఎన్నిక మనీగోడుగా మారిన నేపథ్యంలో డబ్బు దానికితోడు మద్యం ఏరులై పారుతోంది. అటు పార్టీల నుంచి జంపింగ్ లు పెద్దఎత్తున కొనసాగుతున్నాయి. పోలింగ్ దగ్గర పడే కొద్దీ ఇలాంటి జంపింగ్ లు మరిన్ని చూడాల్సి ఉంటుందనే భావన నెలకొంది. ఇక మద్యం, డబ్బుతో పాటు సామాజిక వర్గాల వారీగా ఓట్ల వేట కొనసాగుతోంది.
ఎటుచూసినా మునుగోడులో పార్టీల హడావుడే కనిపిస్తోంది. ఆఖరికి పండుగలను కూడా వదలకుండా దీపావళి సందర్భంగా సేమ్యా, పేనీలు పంచారంటే అర్థం చేసుకోవచ్చు. నవంబరు 3న పోలింగ్
ఉండగా.. చివరి రెండు, మూడు రోజుల్లో ప్రచారం హోరెత్తి ప్రలోభాల పరంపర కొనసాగుతుందని అంతా భావిస్తున్నారు. అయితే, అనూహ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.కోట్లతో బీజేపీ
వల వేసిందన్న కథనాలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
'బీజేపీ సంచలనం' అన్న కేటీఆర్ ప్రతిష్ఠాత్మక ఎన్నికల ముందు మీడియా ఆయా పార్టీల కీలక నాయకులను ఇంటర్వ్యూలు చేస్తుంది. ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితరులను ఇంటర్వ్యూ చేసింది. ఈ ముఖాముఖిలో కేటీఆర్.. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కు ముందు బీజేపీ ఏదో ఒక సంచలనం
రేపుతుందని వ్యాఖ్యానించారు.
అయితే, సహజంగా బీజేపీ తమ విధానాల ప్రకారం ఎన్నికల ముందు చేసే హడావుడి వేరేగా ఉంటుంది. కేటీఆర్ వ్యాఖ్యల రీత్యా చూసినా వారి అదే తరహాలో ఈసారీ బీజేపీ వ్యూహాలు ఉంటాయని భావించారు. కానీ, దానికి భిన్నంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తెరపైకి వచ్చింది. అయితే, ఇదే కాకుండా మరో బీజేపీ సంచలనం ఏమైనా ఉందా? ఏమో మరి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.