ఐఎస్ ఐఎస్...ఈ ఉగ్రవాద సంస్థ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అరాచక సంస్థల్లో ప్రథమ స్థానం ఈ రాక్షస మూకదే. ఇలా క్రూరత్వానికి - అరాచకత్వానికి మారుపేరుగా నిలిచిన ఐఎస్ ఐఎస్ 250 మంది బాలికలను పొట్టన పెట్టుకుంది. అది కూడా తమ కోరిక తీర్చలేదన్న కారణంగా. పైగా అత్యంత కిరాతకంగా వారిని హతమార్చింది. అంతే కాదు వారి కుటుంబ సభ్యులను కూడా ఇదే రకంగా పొట్టన పెట్టుకున్నారు.
ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో 250 మంది బాలికలను ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ రాజ్యం కోసం పనిచేస్తున్న ఉగ్రవాదులను తాత్కాలికంగా పెళ్లాడి వాళ్లకు సెక్స్ బానిసలుగా సేవలందించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలను ఆ అమ్మాయిలు ధిక్కరించారు. తల నరికి చంపుతామని ఈ ఉగ్రవాదులు బెదిరించారు. అయితే బాలికలు తలొగ్గలేదు. ఈ ఘోర చర్యకు తమ ఆడబిడ్డలను అప్పగించేందుకు నిరాకరించిన తల్లిదండ్రులను కూడా ఐఎస్ ఉగ్రవాదులు కలిసి హెచ్చరించారు. వాళ్లు సైతం నో చెప్పడంతో తమ ఆదేశాలకు తలొగ్గి సెక్స్ బానిసలుగా కొనసాగేందుకు నిరాకరించడంతో అటు 250మంది బాలికలను, వారి కుటుంబ సభ్యులను అతికిరాతకంగా తలనరికి చంపేశారు.
కుర్దిష్ డెమొక్రటిక్ పార్టీ అధికార ప్రతినిధి సయెద్ మముజిని ఈ వివరాలను వెల్లడించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఇదే తరహా అరాచకత్వం సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, వారిని సెక్స్ కోసమే వాడుకుంటున్నారని వాపోయారు. అమ్మాయిలు పెళ్లి వయసుకు వచ్చిన తర్వాత తమకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొనేందుకు ఐఎస్ ఉగ్రవాదుల అనుమతి కావాల్సి వస్తోందని తెలిపారు. గతంలోనూ ఇదే విధంగా కిరాతకంగా ఐఎస్ పలు నగరాల్లో పెళ్లికి నిరాకరించిన ముస్లిం మహిళలను నరికి చంపింది.