ఐటీ.. ఈడీ.. సీబీఐలు.. స్వతంత్ర సంస్థలు. అయితే.. ఇలాంటి వాటిని అవసరానికి అస్త్రాలుగా అధికారంలో ఉన్న వారు ప్రయోగిస్తుంటారన్న ఆరోపణ.. విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఎవరున్నా సరే.. తమ అధీనంలో ఉన్న ఈ స్వతంత్ర సంస్థల్ని ఊసిగొల్పి ప్రత్యర్థులకు భయభక్తుల్ని నేర్పుతుంటారన్న తీవ్ర విమర్శ అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థుల మీదా.. కొన్ని లక్షిత కార్పొరేట్ల మీద ప్రయోగించే ఈ అస్త్రం తాజాగా మీడియా సంస్థల మీద ప్రయోగించినట్లుగా విపక్షలు విరుచుకుపడుతున్నాయి. గత ప్రభుత్వాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో.. మోడీ సర్కారు మీదా ప్రత్యర్థుల్ని దారికి తెచ్చుకునే వైనంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంటుంది.
తాజాగా దేశంలోనే ప్రముఖ మీడియా సంస్థగా పేరున్న దైనిక్ భాస్కర్ కు సంబంధించిన ఆఫీసుల్లో.. ఆ సంస్థకు చెందిన ముఖ్యుల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు జరపటం ఇప్పుడు సంచలనంగా మారింది. తెలుగు ప్రజలకు ఈనాడు ఎంత పెద్ద మీడియా సంస్థో.. అంతకు మించిన పెద్ద సంస్థగా దైనిక్ భాస్కర్ ను చెప్పాలి. ఆ సంస్థ రేంజ్ ఎంత పెద్దదంటే.. దేశంలోని 12 రాష్ట్రాలకు విస్తరించి ఉండటమే కాదు.. మొత్తం65 ఎడిషన్లు.. 211 సబ్ ఎడిషన్లు.. హిందీ.. గుజరాతీ.. మరాఠీ భాషల్లో దినపత్రికల్ని ప్రచురిస్తూ ఉంటుంది. దీని సర్క్యులేషన్ కూడా భారీగా ఉంటుంది. పేపర్ కు మాత్రమే పరిమితం కాకుండా ఏడు రాష్ట్రాల్లో 30 రేడియో స్టేషన్లతో పాటు వెబ్ సైట్లు.. ఫోన్ యాప్స్ ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్.. మధ్యప్రదేశ్ లో తిరుగులేని మీడియా దిగ్గజంగా దైనిక్ భాస్కర్ కు పేరుంది. హిందీ న్యూస్ పేపర్లలో ప్రముఖ మీడియా సంస్థగా పేరున్న ఈ సంస్థ.. కరోనా వేళ కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలపై పెద్ద ఎత్తున కథనాల్ని రాసినట్లు చెబుతారు. కరోనా వేళ ప్రభుత్వ అసమర్థతను తాము బయటపెట్టటం వల్లే ఈ దాడులు జరిగినట్లుగా దైనిక్ భాస్కర్ ఆరోపించింది. అంతేకాదు.. భారత్ సంచార్ మీడియా సంస్థలోనూ సోదాలు నిర్వహించారు. యూపీకి చెందిన న్యూస్ చానల్ అయిన ఈ సంస్థకు చెందిన పలు నగరాల్లోని కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాల్ని నిర్వహించారు.
దైనిక్ భాస్కర్ విషయానికి వస్తే.. భోపాల్.. జైపూర్.. అహ్మదాబాద్.. నొయిడాతో పాటు దేశంలోని ఇతర నగరాల్లోని దైనిక్ భాస్కర్ ఆఫీసులపై దాడులు నిర్వహించారు. దైనిక్ భాస్కర్ మీడియా సంస్థ ఒక్క మీడియా వ్యాపారాన్ని మాత్రమే కాకుండా టెక్స్ టైల్స్.. మైనింగ్ వ్యాపారాలు చేస్తుందన్న వాదన ఉంది. అందుకే తాము వాటి లావాదేవీల్ని క్షుణ్ణంగా పరిశీలించామని ఐటీ అధికారులు చెబుతున్నారు. దైనిక్ భాస్కర్ యజమానుల నివాసాలు ఉంటే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో సోదాల్ని నిర్వహించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆదాయపన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఈ సోదాల్ని నిర్వహించినట్లు చెబుతున్నారు.
తమపై జరిగిన ఐటీ సోదాలపై దైనిక్ భాస్కర్ ఘాటుగా రియాక్టు అయ్యింది. కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యాన్నితాము బయటపెట్టామని.. అందుకే తమపై సోదాలు చేపట్టినట్లుగా పేర్కొంది. సోదాలపై దైనిక్ భాస్కర్ తన వెబ్ సైట్లో.. ‘‘మేము స్వతంత్రులం. పాఠకుల అభీష్టమే మాకు పరమావధి’’ అంటూ స్పందించింది. కరోనా సెకండ్ వేవ్ లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల్ని ఎత్తి చూపినందుకు పర్యవసానంగానే ఐటీ దాడులు చేపట్టారని.. తమ గ్రూపు ఉద్యోగుల ఇళ్లల్లో సోదాలు జరిగినట్లు సదరు మీడియా సంస్థ వెల్లడించింది. తమ మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని.. నైట్ షిఫ్ట్ లో ఉన్న ఉద్యోగుల్ని ఇళ్లకు వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీనిపై అధికారపక్షం స్పందిస్తూ.. కేంద్ర సంస్థలు తమ పని తాము చేస్తున్నాయని.. అందులో ప్రభుత్వ జోక్యం చేసుకోదని పేర్కొన్నారు. కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న ఈ సోదాలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి.