దాకవరం అశోక్.. అలియాస్ ఐటీ గ్రిడ్స్ అశోక్. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఈయన పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో! ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పెను దుమారానికి తెరలేపారు. అధికార టీడీపీకి లబ్ధి చేకూర్చేందుకే ఈ డేటా చౌర్యానికి అశోక్ పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా అశోక్ కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఓ మామూలు ప్రైవేటు సంస్థకు డైరెక్టర్ అయిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమావేశాల్లో దర్జాగా ఐఏఎస్ అధికారులతో కలిసి హాజరయ్యేవారట. సమావేశాల్లో ఆయన వాణికి తగిన ప్రాధాన్యం దక్కేదట. పలువురు ఐఏఎస్ లతో కలిసి ప్రభుత్వ సమీక్షా సమావేశాల్లో అశోక్ పాల్గొన్న చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అధికారిక సమావేశాల్లో అశోక్ పాల్గొనడం టీడీపీ పెద్దలతో ఆయన సాన్నిహిత్యానికి నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐటీ గ్రిడ్స్ సంస్థ టీడీపీ అధికారిక యాప్ సేవా మిత్రను రూపొందించింది. సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు - మంత్రి లోకేష్ లతో అశోక్ కు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. అందువల్లే ఆయన ప్రభుత్వ సమావేశాల్లో దర్జాగా పాల్గొనగలిగారని పరిశీలకులు చెబుతున్నారు.
ఏపీ సచివాలయంలోని ఐదో బ్లాక్ లో మంత్రి లోకేష్ ఛాంబర్ ఉంది. అశోక్ ఎప్పుడూ అక్కడే ఉండేవారని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. లోకేష్ కార్యాలయంలో అశోక్ దే హవా అని.. ఆయన చెప్పిన పని క్షణాల్లో జరిగిపోయేదని వారు తెలిపారు. ఇక లోకేష్ శాఖల ద్వారా ఐటీ గ్రిడ్స్ కు రూ.కోట్ల నిధులు బదిలీ అవ్వడం కూడా ప్రశ్నార్థకమవుతోంది. పలు ఐటీ కాంట్రాక్టులను ఉద్దేశపూర్వకంగానే ఆ సంస్థకు లోకేష్ కట్టబెట్టినట్లు ఈ లావాదేవీల ద్వారా స్పష్టమవుతోందని విశ్లేషకులు సూచిస్తున్నారు. అశోక్ కోసం చంద్రబాబు - లోకేష్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు.