ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ చేస్తున్న పోరాటాన్ని సమూలంగా అణిచివేయడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా గిద్దలూరు ఇన్చార్జి ఐవీ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి వైసీపీ మడమ తిప్పని పోరాటం చేస్తోంటే.. వారికి ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వచ్చేస్తుందో అనే సంకుచితమైన బుద్ధితో చంద్రబాబునాయుడు పోరాటాల్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తూ రాష్ట్ర అభ్యున్నతికి ద్రోహం చేస్తున్నాడని ఐవి రెడ్డి నిశితంగా విమర్శించారు.
ఢిల్లీలో హోదా కోసం వైసీపీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలతో పాటూ ఐవి రెడ్డి కూడా పాల్గొన్నారు. ‘‘ప్రత్యేక విమానాల్లో తిరిగే బాబూ.. నీకు ప్రత్యేక హోదా వద్దా..’’ అంటూ ప్లకార్డులు చేతపట్టిన ఐవీ రెడ్డి.. ధర్నా కార్యక్రమంలో మాట్లాడుతూ.. ప్రత్యేకహోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని.. వారి త్యాగాలు వృథా అయ్యే అవకాశం లేదని.. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రత్యేకహోదాను కూడా సాధించి తీరుతాం అని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రత్యేకహోదా కోసం తన నియోజకవర్గంలో కూడా తొలినుంచి అలుపెరగని పోరాటం సాగిస్తున్న ఐవీ రెడ్డి ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టారు. సంతకాల సేకరణ, ధర్నాలు లాంటి కార్యక్రమాలతో హోదా గురించి చైతన్యం కలిగించే కార్యక్రమాలు అనేకం నిర్వహించారు. హోదా రాష్ట్రానికి మేలు జరుగుతుందని.. దీనకోసం తొలినుంచి అవిశ్రాంత పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో తామంతా సాధించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని ఐవీ రెడ్డి చెప్పారు.
ఎప్పటికైనా సరే.. జగనన్న సారథ్యంలోనే రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తుందని ఐవీ రెడ్డి చెప్పారు. ఈ పోరాటాల్ని అణచివేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబునాయుడుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు కూడా ఎంతో దూరంలో లేదని ఐవీ హెచ్చరించారు.