తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతికి పాల్పడుతున్నది? ఎంతెంత స్వాహా చేస్తున్నది? ఎన్ని పదుల, వందల కోట్లు ఏ రూపంలో అక్రమార్కుల సొంతజేబుల్లోకి చేరిపోతున్నాయి? ప్రభుత్వ ఖజానికు ఏ రకంగా కన్నం పడుతోంది? ఇలాంటి అనేకానేక అంశాల మీద ప్రజల దృష్టి మళ్లకుండా ఉండేందుకే తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంతో నాటకాల కజ్జాలు పెట్టుకుంటూ.. ప్రజలను డైవర్ట్ చేస్తున్నదని అనేక మంది భావిస్తున్నారు. కేవలం కొన్ని లోపాయికారీ ఒప్పందాలతో కూడిన ప్రభుత్వ నిర్ణయాల కారణంగా కొన్ని వందల కోట్లు ఏపీ ఖజానాకు భారంగా మారుతున్న అనేకానేక నిర్ణయాల గురించి వైఎస్సార్ కాంగ్రెస్ గిద్దలూరు నియోజకవర్గ సమన్వయ కర్త ఐవీ రెడ్డి ప్రభుత్వాన్ని గట్టిగానే నిలదీస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించేలా.. ప్రభుత్వ దురాగతాల్ని ఎండగడుతున్న ఐవీ రెడ్డి.. తాజాగా ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. విద్యుత్ మరియు రాజధాని లోని తాత్కాలిక - ఇతర నిర్మాణాల పరంగా జరిగే భారీ దోపిడీని ఆయన ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబునాయుడు.. నిరంతరాయ విద్యుత్తు ఇస్తున్నాం అంటూ ప్రజల్ని మాయచేస్తున్నారే తప్ప... విద్యుత్తు కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయో ప్రజలకు స్పష్టత లేదు. ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొంటున్న సౌర విద్యత్తు విలువ పిపిఏ ఒప్పందం ప్రకారం 2.63 రూపాయలుంటే ఏపీలో 4.63 రూపాయలకు జరిగిన ఒప్పందాలను ఆయన ప్రశ్నిస్తున్నారు.
అలాగే సాధారణంగా దేశంలో చదరపు అడుగు భవన నిర్మాణానికి 1500 నుంచి 1600 ధరకు బ్రహ్మాండమైన భవంతులు లేస్తుండగా - రాజధాని కట్టే సంస్థలకు ఇసుక ఉచితంగా ఇవ్వడంతో పాటు 4600 రూపాయలు చదరపు అడుగుకు ఇవ్వడం పచ్చి దోపిడీ మరియు పచ్చ దోపిడీ కాదా అని కూడా ఐవీరెడ్డి ప్రశ్నిస్తున్నారు. 1500 కోట్లు వెచ్చించి చేసిన తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో.. ఈ లెక్కన ఎంత మొత్తం స్వాహా అయిందో కదా అనే అనుమానాలు ఈ ప్రశ్నల వలన ప్రజల్లో కలుగుతున్నాయి.
తెలుగుదేశం సర్కారు ప్రస్తుతం జాతీయ స్థాయిలో నడిపిస్తున్న పోరాటం అనేది.. కేవలం ఒక డ్రామా అని.. ఇలాంటి అరాచక పోకడల మీద ఎవరూ దృష్టిసారించకుండా ప్రయత్నం అని పలువురు అంటున్నారు.