ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రస్తుతం అధికార టీడీపీ చేస్తున్న పోరాటం, ఏపీలో కొనసాగుతున్న టీడీపీ పాలన, సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ వ్యవహార శైలిపై... వైసీపీ సీనియర్ నేత - ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఐవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఐవీ రెడ్డి... టీడీపీ పాలనలో ఏపీ దేశంలో మోస్ట్ కరప్టెడ్ స్టేట్ గా అపఖ్యాతి మూటగట్టుకుందని ఆరోపించారు. చంద్రబాబును హవాలా బాబుగా అభివర్ణించిన ఐవీ రెడ్డీ... చంద్రబాబు ఫారిన్ టూర్లపై విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వివిధ రూపాల్లో పోగేసిన సొమ్మును దాచుకునేందుకే చంద్రబాబు ఫారిన్ టూర్లు వేస్తున్నారని, అయితే ఆ టూర్లన్నీ కూడా రాజధాని నిర్మాణాల పరిశీలన, రాష్ట్రానికి పెట్టుబడుల కోసం వేట అనే పేర్లు పెడుతున్నారని కూడా ధ్వజమెత్తారు. టీడీపీ పాలన కారణంగా ఏపీ ఇప్పుడు దేశంలోనే అత్యంత అవినీతి కలిగిన రాష్ట్రంగా రికార్డులకెక్కిందని ఆయన ఆరోపించారు.
బాబు పాలనలో లెక్కలేనన్ని కుంభకోణాలు బయటపడుతున్నాయని, ఈ స్కాంలపై విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఆయన డిమాండ్ చేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ రీసెర్చీ రాష్ట్రాన్ని అవినీతిలో ప్రథమ స్థానంలో నిలిపిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ క్రమంలో తాము నిజాయతీ పాలనను సాగిస్తున్నామని చెప్పుకుంటున్న చంద్రబాబు సర్కారు... తమపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధం కావాలని సూచించారు. ఈ తరహా విచారణకు అసలు టీడీపీకి దమ్ముందా? అని కూడా ఐవీ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు ఫ్యామిలీతో పాటు బాబు కేబినెట్ లోని ఏ ఒక్క మంత్రి కూడా అవినీతికి దూరంగా లేరని, చివరకు అధికార పార్టీ ఎమ్మెల్యేల పేరిట టీడీపీ ఎమ్మెల్యేలు - నియోజకవర్గ స్థాయి నేతలు ప్రజలను నిలువునా దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ మొత్తం అవినీతి తంతుకు నాయకుడిగా వ్యవహరిస్తున్న నారా లోకేశ్ త్వరలోనే జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదని కూడా ఐవీ రెడ్డి జోస్యం చెప్పారు.
లోకేశ్ భవిష్యత్తు గురించి ఐవీ రెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే... *నారా లోకేశ్ అరెస్టును ఏ ఒక్కరు కూడా అడ్డుకోలేరు. టీడీపీ నేతలు లెక్కలేనన్ని కుంభకోణాల్లో పాలుపంచుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలను లక్షలాది కోట్ల రూపాయల మేర దోచుకుంటున్నారు. ప్రతి ప్రాజెక్టు - ప్రతి పథకంలోనూ అవినీతే. అది పోలవరమైనా, కాల్ మనీ సెక్స్ రాకెట్, ఇసుక మాఫియా, రాజధాని నిర్మాణం... ఇలా ప్రతి దానిలోనూ అవినీతి చోటుచేసుకుంటోంది* అని ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇంత మేర ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తనపై సీబీఐ విచారణకు నారా లోకేశ్ సిద్ధమా? అని ఐవీ రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న చంద్రబాబును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన ఐవీరెడ్డి... బాబు టూర్లన్నీ రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేనివేనని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు అండ్ కో చేస్తున్న డ్రామాలను ఆపాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.