గిద్ద‌లూరు స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌ తో ప్ర‌స్తావించిన ఐవీ రెడ్డి

Update: 2017-02-12 10:01 GMT
ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహ‌న్ రెడ్డితో గిద్దలూరు వైఎస్ఆర్‌సీపీ ఇన్చార్థి ఐవీరెడ్డి స‌మావేశం అయ్యారు. గిద్దలూరు నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలను ఈ సంద‌ర్భంగా ఐవీ రెడ్డి వివరించారు. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రధానంగా త్రాగునీటి సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఐవిరెడ్డి వైఎస్ జగన్‌కు తెలిపారు నియోజకవర్గంలో శాశ్వత ప్రాతిపదికన మంచినీటి ప‌థ‌కాలు లేక‌పోవ‌డం, భూగర్భజలాలు అడుగంటడం, చెరువులకు, కాల్వలకు నీరు చేరే మార్గాలు మూసుకుపోవడం వంటి పరిణామాలతో నియోజకవర్గంలో నీటి సమస్య పెరిగిందని ఐవీ రెడ్డి వివరించారు. దీనికితోడు గత పాలకులు నీటి సమస్యలను తీవ్రంగా విస్మరించారని తెలిపారు.

గిద్ద‌లూరు నియోజకవర్గంలో వ్యవసాయ రంగం గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటుందని, వ్యవసాయ అనుబంధ రంగాలు సైతం విషమ పరిస్థితులలో ఉన్నాయని ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌కు ఐవీ రెడ్డి తెలిపారు. ఉపాది అవకాశాలు లేక చదువుకున్న యువకులు మిలటరీ, సర్వే ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు పెద్ద ఎత్తులో పోటీ ప‌డుతున్నారని తెలిపారు. వైసీపీ ఆధ్వర్యంలో తాము నిరుద్యోగులకు ఉపాది అవకాశాలను పెంపొందిస్తున్నామని, వివిధ కంపెనీలతో సంప్రదించి జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని వైసీపీ అధినేత‌కు ఐవీరెడ్డి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ మాట్లాడుతూ ప‌లు వ‌ర్గాల ద్వారా త‌న‌కు వ‌స్తున్న స‌మాచారం గిద్ద‌లూరు ఇన్చార్జీ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించ‌డంలో పూర్తి స‌మ‌ర్థంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఐవీ రెడ్డిని అభినందించారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని గిద్దలూరు నియోజకవర్గానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి స‌మ‌స్య‌లు పరిష్కరిస్తామని ప్రజలకు తనవంతుగా ప్రచారం చేయాల‌ని జ‌గ‌న్‌ ఐవీరెడ్డికి సూచించారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గంతోపాటు రాప్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు జగన్, ఐవిరెడ్డిల మధ్య ప్రధానంగా చోటుచేసుకున్నాయి.
Tags:    

Similar News