యార్లగడ్డకు జగన్ హామీ అదే?!

Update: 2019-10-29 10:39 GMT
వల్లభనేని వంశీ మోహన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీకి అబ్జక్షన్ చెబుతున్న యార్లగడ్డ వెంకట్రావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత నుంచి ఆఫర్ వెళ్లినట్టుగా తెలుస్తోంది.  సార్వత్రిక ఎన్నికల్లో గన్నవరం నుంచి యార్లగడ్డ వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. స్వల్పమైన ఓట్ల తేడాతోనే ఆయన ఓడిపోయారు.

తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వంశీ మోహన్ స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. పోరు హోరాహోరీగా సాగింది. ఫలితాల విడుదలకు ముందే యార్లగడ్డ ఇంటికి వెళ్లి వంశీ మోహన్ చాలా హడావుడి చేశాడు కూడా. దీంతో వారి మధ్యన విబేధాలు తీవ్ర స్థాయికి వెళ్లాయి.

వైసీపీ అధికారంలోకి వచ్చినా యార్లగడ్డ ఎమ్మెల్యే కాలేకపోయారు.ఈ నేపథ్యంలో ఇప్పుడు  వంశీ మోహన్ వైసీపీలోకి రావడాన్ని యార్లగడ్డ సహజంగానే సహించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు సర్ధి చెప్పడానికి  వైసీపీ అధినేత రెడీ అయినట్టుగా తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేస్తున్నారని వార్తలు  వస్తున్నాయి.

ఈ మేరకు కృష్ణా జిల్లా ఇన్ చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా యార్లగడ్డకు వర్తమానం అందిందని - ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేస్తున్నారని - ఉప ఎన్నికల తర్వాత ఆ పదవి వరిస్తుందని ఆయనకు చెప్పారని సమాచారం. ఒకవేళ ఎమ్మెల్సీ పదవిని తీసుకుంటే యార్లగడ్డ ఉప ఎన్నికల్లో టికెట్ ను త్యాగం చేయాల్సి ఉంటుంది. అప్పుడు  వంశీకే అది దక్కవచ్చు కూడా! అయితే యార్లగడ్డ అనుకచవర్గం మాత్రం ఎమ్మెల్సీ పదవి వద్దని.. తమకు నియోజకవర్గం ఇన్ చార్జే  కావాలని పట్టుపడుతూ ఉన్నారట!
Tags:    

Similar News