ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం: టీడీపీ పాలనపై సీబీఐ విచారణ

Update: 2020-06-11 10:30 GMT
తెలుగు దేశం పార్టీ హయాంలో జరిగిన పరిపాలన నిర్ణయాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం  సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రన్న సంక్రాంతి కానుక - రంజాన్ తోఫా - ఏపీ ఫైబర్ నెట్ లో అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని నిర్ణయించింది. గురువారం సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయంతో టీడీపీ తెలుగు దేశం పార్టీ ఇరుకున పడింది. సీఎం జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవి:

- వైఎస్సార్ చేయూత పథకానికి మంత్రివర్గం ఆమోదం.

- ఎస్సీ - ఎస్టీ - బీసీ మహిళలకు నాలుగేళ్లలో రూ.50 వేల ఆర్థిక సాయం

- ఆగస్టు 12వ తేదీన పథకం ప్రారంభం సీఎం జగన్

- భోగాపురం ఎయిర్ పోర్టు - రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఆమోదం

- ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి నిర్ణయం

- జూన్ 16వ తేదీ నుంచి 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మంత్రివర్గం నిర్ణయం

-  గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై కేబినెట్ లో కీలక నిర్ణయాలు. ఏపీ ఫైబర్ నెట్ - రంజాన్ తోఫా - చంద్రన్న కానుకపై సబ్ కమిటీ నివేదిక.

- నివేదిక ఆధారంగా అక్రమాలపై సీబీఐకి దర్యాఫ్తు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయం. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Tags:    

Similar News