ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ గొప్ప శుభవార్త చెప్పారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దాదాపు ఐదారు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రక్రియకు మరోసారి జగన్ ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది..
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం డిసెంబర్ 25వ తేదిన క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రారంభం కానుంది.
హైకోర్టులో స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. డిసెంబర్ 25న అర్హులకు డీ-ఫాం పట్టా ఇచ్చి ఇళ్ల స్థలం కేటాయించనున్నారు.
ఇప్పటికే జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా 30,68,281 మంది లబ్ధిదారులను గుర్తించింది. వీరందరికీ క్రిస్మస్ రోజు పట్టాలు అందించడంతోపాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టబోతున్నారు.
తొలి దశలో ఏకంగా 15 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇళ్ల పట్టాలను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేయనున్నారు.