బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌పై జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గిన‌ట్టేనా?

Update: 2021-09-29 10:30 GMT
ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యంలో అన్ని వ‌ర్గాల నుంచి ముఖ్యంగా ఆయ‌న ఆరాధి స్తున్న స్వాముల నుంచి మ‌ఠాల నుంచి కూడా వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఇలా చేయ‌డం త‌గ‌ద‌ని కొంద‌రు సూచిస్తే.. మ‌రికొంద‌రు. రాష్ట్ర వ్యాప్త ఉద్య‌మాల‌కు కూడా రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు.. జ‌గ‌న్ తాను తీసుకున్న‌నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునేందుకు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఇండిపెండెంట్‌గా ఉన్న బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ను దేవ‌దాయ శాఖ నుంచి త‌ప్పించి.. బీసీ సంక్షేమ శాఖ‌లో విలీనం చేసేందుకు.. ఏపీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల గెజిట్ నోటిఫికేష‌న్ జారీ చేసింది.

సీఎం ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. ఆదిత్య‌నాథ్‌దాస్‌.. ఈ జీవో జారీ చేశారు. అయితే..ఈ జీవోపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు రావ‌డంతో .. దీనిని వెన‌క్కి తీసుకునేందుకు రెడీ అయింది. కానీ, ఇప్పుడే కాద‌ని.. సీఎస్ దాస్ ఈ నెల 30న అంటే.. గురువారం ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్న నేప‌థ్యంలో దాని త‌ర్వాత‌.. ఇది జ‌రుగుతుంద‌ని.. ఆయ‌న ఉన్న‌ప్పుడే.. దానిని వెన‌క్కి తీసుకుంటే.. ఆయ‌న‌ను అవ‌మానించిన‌ట్టు అవుతుంద‌ని.. ప్ర‌భుత్వం భావిస్తోంది.  ఇదే విష‌యాన్ని అధికార వ‌ర్గాలు సైతం వెల్ల‌డించాయి.

దీనిని బ‌ట్టి.. ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ప్ర‌త్యేక విభాగం ఏర్పాటు చేసి.. దానిలోకి బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ను విలీనం చేసే దిశగా సీఎం జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తంది. దీంతోపాటు.. ఇత‌ర రెడ్డి, క‌మ్మ‌, కాపు, వైశ్య స‌హా అగ్ర‌వ‌ర్ణ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన కార్పొరేష‌న్ల‌ను ఈ డ‌బ్ల్యుఎస్ విభాగంలోకి చేర్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇదంతా కూడా వ‌చ్చే కేబినెట్‌లో చ‌ర్చించిన త‌ర్వాత‌.. నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

వాస్త‌వానికి బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌.. గ‌త ప్ర‌భుత్వంలో ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నాయుడు ఏర్పాటు చేశారు. డిసెంబ‌రు 2014లో ఏర్పాటు చేసిన ఈ కార్పొరేష‌న్ అప్ప‌ట్లోనూ.. బీసీ సంక్షేమ శాఖ ప‌రిధిలోనే ఉండేది. అయితే.. బ్రాహ్మ‌ణ వ‌ర్గం నుంచి విమ‌ర్శ‌లు రావ‌డంతో.. దీనిని త‌ప్పించి.. 2015లో దేవ‌దాయ  రెవెన్యూ ప‌రిధిలోకి చేర్చారు. ఇదిలావుంటే.. గ‌త వారం జ‌గ‌న్ ప్ర‌భుత్వం బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌ను తిరిగి బీసీ సంక్షేమ శాఖ విభాగంలోకి చేర్చాల‌ని దీనివ‌ల్ల కొన్ని న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు తొలుగుతాయ‌ని భావించింది. అయితే.. ఇది తీవ్ర విమ్శ‌ల‌కు దారితీసింది.
 
ఈ క్ర‌మంలోనే టీడీపీ అనుకూల బ్రాహ్మ‌ణ నాయ‌కులు.. వేమూరి ఆనంద సూర్య‌, ఇత‌ర నాయ‌కులు.. కూడా జ‌గ‌న్ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు ఉద్య‌మానికి రెడీ అంటూ.. పిలుపునిచ్చారు. మ‌రీముఖ్యంగా విశాఖ శార‌దా పీఠాధిప‌తి.. స్వామి స్వ‌రూపానందేంద్ర స్వామి.. కూడా జ‌గ‌న్ స‌ర్కారుపై అస‌హ‌నం వ్య‌క్తం చ‌శారు. ఈయ‌న జ‌గ‌న్‌కు అత్యంత ప్రియ‌మైన రాజ‌గురువు అన్న సంగ‌తి తెలిసిందే.  ఫ‌లితంగా.. ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

స్వ‌రూపానందేంద్ర ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ.. ``మేం ఈ విష‌యాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్నాం. సీఎం జ‌గ‌న్‌తో చ‌ర్చించేందుకు రెడీ అవుతున్నాం.. ఈ నోటిఫికేష‌న్‌ను వెన‌క్కి తీసుకోవాల్సిందే`` అని పేర్కొన్నా రు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వానికి ఆయ‌న ఈ ప్ర‌తిపాద‌న‌ను.. వెన‌క్కి తీసుకోవాల‌ని.. ఆయ‌న సూచించిన ట్టు..  స‌మాచారం. అంతేకాదు.. అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఒక విభాగం ఏర్పాటు చేసి దాని కింద దీనిని ఏర్పాటు చేయాల‌ని కూడా ఆయ‌న సూచించార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న వ‌స్తుంద‌ని భావిస్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి. 
Tags:    

Similar News