ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఉద్దానంలో కిడ్నీ బాధితుల విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తోందని జగన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో జగన్ పర్యటన రెండోరోజు ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి గ్రామం హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో సాగింది. ఈ సందర్భంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. జగతి గ్రామంలో కిడ్నీ బాధితులతో ముఖాముఖి సందర్భంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న వేలాది మందితో జగన్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సర్కారుకు చర్మం మందం ఎక్కువ. ప్రజల బాధలను పట్టించుకోరు. ఆరోగ్యశ్రీ రోగులపట్ల కనికరం లేదు అంటూ జగన్ మండిపడ్డారు.
పేదల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఉందని జగన్ మండిపడ్డారు. విశాఖ వరకు వెళ్లి వైద్యం చేయించుకోలేక బాధితుల అవస్ధలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 60రోజుల్లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తామని మాట తప్పిన మంత్రి కామినేని ప్రజలకు జవాబు చెప్పాలన్నారు. పరిశోధనా కేంద్రం ప్రకటనలకే పరిమితమైందని మండిపడ్డారు. ``రోగులు డయాలసిస్ కోసం ఒక్కొక్కరికి నెలకు రూ.15నుంచి 20వేల వరకు ఖర్చు చేస్తున్నారు. కిడ్నీ వ్యాధి బారిన పడివాళ్లకు మొదట మందులు ఇస్తారు. బ్లడ్ లెవెల్స్ మెయింటెనెన్స్ కోసం వారం లేదా రెండు రోజులకు ఒకసారి ఇంజక్షన్ ఇస్తారు. ఒక్కో ఇంజక్షన్ కు రూ.650 ఖర్చవుతుంది. మందులకు రూ.2 వేల నుంచి రూ.5వేల దాకా ఖర్చవుతోంది. అప్పటికీ జబ్బు తగ్గకపోతే డయాలసిస్‌లోకి వెళతారు. దీనికి నెలకు రూ.20 వేల దాకా ఖర్చవుతుంది. ఇక చివరిస్టేజ్.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. ఈ ఆపరేషన్ ఖర్చు రూ.10 లక్షలు, ఆపరేషన్ తర్వాత మందులకు అయ్యే ఖర్చు అదనం. వ్యాధికి గురయ్యేవారిలో అధికులు పేదలే. వాళ్లందరిదీ వైద్యం చేయించుకోలేని పరిస్థితే. అలాంటి వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో ఆర్థికంగా స్థోమత లేక కిడ్నీ బాధితులు ప్రాణాలు విడుస్తున్నారు`` అని జగన్ పేదల పరిస్థితి ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది దీంతో పేషంట్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని జగన్ తెలిపారు. `` ప్రభుత్వమే ఆరోగ్యశ్రీని పట్టించుకోకపోవడంతో ఆసుపత్రులు రోగులను చూడటం లేదు...రేపురా...మరునాడు రా.. అని తిప్పుతున్నారు. పాత రేట్లకు ఆరోగ్యశ్రీ ఛార్జీలున్నాయి. డాక్టర్లకు గిట్టుబాటు కావడం లేదు. చాల వరకు ఆసుపత్రుల బిల్లులు పెండింగులో ఉన్నాయి. రేట్లు పెంచాలని ఆసుపత్రులు అడుగుతున్నాయి. 108 నంబరుకు ఫోను చేస్తే ఇది వరకు 20 నిమిషాలలో వచ్చేది. రోగులను తీసుకెళ్ళి ఆసుపత్రికి చేర్చేవారు. ఇపుడు 108 ఉద్యోగులకు జీతాలు లేవు. వాహనాలకు పెట్రోలు , డీజిల్ లేదు. ఆరోగ్యశ్రీ వార్షిక బడ్జెట్ రూ 1400 కోట్లు. అయితే చంద్రబాబు వెయ్యి కోట్లు మాత్రమే కేటాయించారు. గత ఏడాది బకాయిలు రూ 485 కోట్లు. ఇలా ఆరోగ్యశ్రీ పథకం నిర్వీర్యం అయ్యింది. ఆరోగ్యశ్రీని చంద్రబాబు పట్టించుకోవడం లేదు`` అని ఆక్షేపించారు. కిడ్నీ రోగులకు వైద్యం అందడం లేదని జగన్ ఆక్షేపించారు. ``మూగ, చెవుడు పిలల్లకు గతంలో వైఎస్ ఆరు లక్షలు ఇచ్చేవారు. ఇవాళ ఆరోగ్యశ్రీ నిధులను కత్తిరిస్తున్నారు. మూగ ,చెవుడు పిల్లల బడ్జెట్ ను కూడా కట్ చేస్తున్నారు. రోగుల బాధలను సర్కారు పట్టించుకోవడం లేదు. పేద ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే విధమైన పరిపాలన ఉండాలి`` అని జగన్ పేర్కొన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/