కృష్టా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 11 మంది మరణించడంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న జగన్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ జగన్ ను పోలీసులు - టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా అధికారుల తీరుపై - రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై మీడియాతో మాట్లాడుతూ జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రోడ్డు ప్రమాదంలో 11 మంది మృత్యువాత పడటం బాధాకరమని జగన్ అన్నారు. ఘటన స్థలంలో చూస్తే ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించే వీలు లేదని జగన్ అన్నారు. బస్సు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఉంటుందని గాల్లో ప్రయాణం చేసి కల్వర్టును ఢీకొట్టడం వల్లే ఇంతమంది మృత్యువాత పడ్డారని జగన్ అభిప్రాయపడ్డారు. చనిపోయిన వారికి కనీసం పోస్టు మార్టం చేయకుండానే శవాన్ని మూటకట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాలకు డాక్టర్లు రెండు గంటల్లో పోస్టుమార్టం చేసినట్లు మూట కట్టడం ఏమిటని జగన్ విస్మయం వ్యక్తం చేశారు. చనిపోయిన వారిపట్ల ఇంత అమానవీయంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఇంత ఘోరం జరిగిన డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడిపారా? లేదా అన్నది తెలియాలంటే శవానికి పోస్టుమార్టం చేయాలని అన్నారు. పోస్టుమార్టం చేస్తే డ్రైవర్ తాగాడా? లేడా అన్నది తెలుస్తుందని కానీ డ్రైవర్ వివరాలు అడిగితే డాక్టర్ పోస్టుమార్టం చేయలేదని సమాధానం చెప్పారని జగన్ తెలిపారు. రెండో డ్రైవర్ ఏమయ్యాడు, ఎక్కడున్నారని కలెక్టర్ ను అడిగితే "ఆయన లేడు..వెళ్లిపోయాడు" అని కలెక్టర్ చెబుతుండట ఆశ్చర్యకరంగా ఉందన్నారు. రెండో డ్రైవర్‌కు లైసెన్స్ ఉందా? లేదా? ఆ డ్రైవర్‌ను ఎందుకు పంపించారో సమాధానం చెప్పాలని జగన్ డిమాండ్ చేశారు.
ప్రతి ఏటా కేశినేని - దివాకర్ ట్రావెల్స్ ప్రమాదాలకు గురవుతున్నాయని జగన్ తెలిపారు. ఈ బస్సుల యాజమాన్యాలు టీడీపీ నేతలు కావడంతో ఎలాంటి నిబంధనలు వర్తించడం లేదని - ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతూ అమాయకుల ప్రాణాలు బలిగొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బస్సుల యాజమాన్యాలు ఒకే బస్సు పర్మిట్ తో మూడు -నాలుగు రూట్లతో తిప్పుతున్నారని తెలిపారు. రూల్స్ ఏమీ పట్టించుకోకుండా కాంట్రాక్ట్ క్యారియర్లను స్టేజీ క్యారియర్లుగా తిప్పుతున్నారని తెలిపారు.ఆపకూడని చోట కూడా ఆపుతున్నారని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినా పట్టించుకోవడం లేదని జగన్ మండిపడ్డారు. ఇంతదారుణంగా దగ్గరుండి రూల్స్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ అన్నారు. అధికారం ఉంటే ప్రాణాలతో చెలగాటం ఆడవచ్చా అంటూ జగన్ సూటిగా నిలదీశారు. బస్సు ప్రమాదంలో మరణించిన వారికి ఒక్కోక్కరికి రూ. 2 లక్షలు, 5 లక్షలు పరిహారం ఇవ్వడం సరికాదని జగన్ అన్నారు. ఈ ప్రమాదం విషయంలో బస్సు యాజమాన్యం ఎంత ఇస్తుందో క్లారిటీ ఇవ్వాలన్నారు. కనీసం రూ.20 లక్షలు పరిహారం ఇప్పిస్తేనే ఇలాంటి ప్రమాదాలు ఆగుతాయని తెలిపారు. "రాష్ట్ర ప్రభుత్వం బస్సు యాజమాన్యాలను ఈవిధంగా రక్షిస్తే....రేపు మీ పిల్లలు, మా పిల్లలు కూడా ఇదే బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్యలకు ఫుల్‌స్టాప్ పెట్టండి. ఇవాళ వాళ్లకు జరిగింది. రేపు మన కుటుంబాలకు జరిగే అవకాశం ఉంది. నిజాలను వెలికితీయండి, చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇప్పించే ప్రయత్నం చేయండి. అలాగైనా బాధిత కుటుంబాలకు తోడుగా నిలబడదాం. ఇందుకు పోలీసులు, మీడియా మానవత్వంతో వ్యవహరించాలి" అని జగన్ ఈ సందర్భంగా కోరారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/