సోషల్ మీడియా మీద జగన్ ఫుల్ ఫోకస్....కీలక నేత కుమారుడికి పగ్గాలు

Update: 2022-09-13 07:36 GMT
ఏపీలో రాబోయే ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రాధాన్యత ఏంటి అన్నది జగన్ కి బాగా తెలుసు. ఒక విధంగా 2019 ఎన్నికల్లో  సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వాడుకుని 151 సీట్లతో ఆయన అధికరంలోకి వచ్చారు. మళ్లీ ఏపీలో జెండా ఎగరేయాలన్న ఆలోచనతో జగన్ ఉన్నారు. దాంతో ఈ మధ్య సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టేశారు. మూడేళ్ళ పాటు ఈ వైపు కూడా వైసీపీ పెద్దలు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు ఉన్నాయి.

అదే టైం లో ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం సోషల్ మీడియా విషయంలో చాలా ముందుంది. జోరు చేసి మరీ  దూసుకుపోతోంది అని కూడా చెప్పాలి. ఈ నేపధ్యంలో తాము ఎక్కడ ఉన్నామన్న సంగతి వైసీపీ ఈ మధ్యనే గ్రహించారు. దాంతో ఎప్పటికపుడు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటిదాకా సోషల్ మీడియా వింగ్ ని ఎంపీ, జగన్ సన్నిహితుడు అయిన విజయసాయిరెడ్డి చూసేవారు. అయితే ఇపుడు  ఆయన ప్లేస్ ని మార్చేశారు. ఆయన నుంచి బాధ్యతలను కూడా లాగేసుకున్నారు.

వైసీపీలోని ఒక కీలకనేత కుమారుడికి వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు మొత్తం చూసే విధంగా  నిర్ణయం తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసులో జగన్ పార్టీకి చెందిన ముఖ్యులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనే సోషల్ మీడియా బాధ్యతలను కొత్త నేతలో పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ఐప్యాక్ ప్రతినిధి, రిషిరాజ్. ఆయన బృందం, సోషల్ మీడియాకు చెందిన కో ఆర్డినేటర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి హాజరయ్యారని సమాచారం.

ఈ సమావేశంలో ప్రభుత్వ అమలు చేస్తున్న కార్యక్రమాలను ఎప్పటికపుడు ప్రజలలో ఉంచాలని, అలాగే ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను కూడా ధీటుగా తిప్పికొట్టాలని  జగన్ సూచించినట్లుగా తెలిసింది. అలాగే వైసీపీ జనాల్లోకి చొచ్చుకుపోవడానికి వారి మెదళ్ళకు చేరడానికి బలమైన కంటెంట్ ని తయారు చేయాలని అది సోషల్ మీడియాలో టాప్ నుంచి బాటం వరకూ చేరేలా చూడాలని జగన్ సూచించినట్లుగా చెబుతున్నారు.

అంతే కాదు ఐప్యాక్ టీం కి కూడా కొన్ని కీలకమైన సలహాలు జగన్ ఇచ్చారని చెబుతున్నారు. అలాగే సోషల్ మీడియా కో ఆర్డినేటర్లు ఎలా పనిచేయాలో కూడా ఆయన దిశానిర్దేశం చేశారని అంటున్నారు. మొత్తానికి సోషల్ మీడియాను ఫుల్ గా వాడుకోవాలని వైసీపీ డిసైడ్ అయింది.

అయితే సోషల్ మీడియా యాక్టివిటీస్  ఇంకా అనుకున్న స్థాయిలో సాగడంలేదన్న అసంతృప్తి అయితే పార్టీ పెద్దలలో ఉంది అంటున్నారు. సోషల్ మీడియాను ఒక బలమైన ఆయుధంగా మార్చాలంటే ఏం చేయాలన్నదే ఇపుడు జగన్ సహా పార్టీ పెద్దలు తరచూ సమావేశమై చర్చిస్తున్నారు. మరి వైసీపీలోని  కీలక నేత కుమారుడి చేతికి ఈ పగ్గాలు అప్పగిస్తున్నారు. ఇకనైనా వైసీపీ సోషల్ మీడియా జోరు అందుకుంటుందా. చూడాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News