రాజధానులకు లైన్ క్లియర్ చేస్తున్న జగన్

Update: 2020-08-14 10:40 GMT
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం తెలిపినా ఏపీ హైకోర్టులో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే న్యాయప్రక్రియలో ఇబ్బందులు తొలిగించేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.

ప్రస్తుతం హైకోర్టులో ప్రధాన అభ్యంతరంగా ఉన్న రాజధాని పెండింగ్ ప్రాజెక్టులతోపాటు అమరావతి రైతులకు ఇచ్చిన హామీల విషయంలో స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే న్యాయస్థానాలకు హామీ ఇచ్చేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది.

తాజాగా సీఎం జగన్ నిర్వహించిన అమరావతి మెట్రోపాలిటిన్ డెవలప్ మెంట్ అథారిటీ సమీక్షలోనూ ఇదే విషయం స్పష్టమైంది. రాజధాని ప్రాంత రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నిర్ణయించింది. అమరావతి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయగలిగితే రైతుల్లో భయాందోళనలకు ఫుల్ స్టాప్ పడుతుంది. దాదాపు 18వేల కోట్లు అమరావతి ప్రాజెక్టుల కోసం అవసరం అవుతాయని నిర్ధారించారు.

ఈ ప్రాజెక్టు అమలు చేస్తే కోర్టుల్లో పిటీషన్లు వేసిన రైతులు, స్థానికులకు భరోసా నిచ్చినట్టు అవుతుంది. కాబట్టి రాజధాని వికేంద్రీకరణపై కోర్టుల్లోనూ జగన్ సర్కార్ కు ఊరట దక్కే అవకాశం ఉంటుంది. అందుకే తాజాగా అమరావతి ప్రాజెక్టులపై హైకోర్టు ఫోకస్ చేసింది.
Tags:    

Similar News