ఇచ్చిన హామీల్లో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాటిని నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో దశలవారీగా మద్య నిషేధం అమలుచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు మద్యపాన నిషేధంపై ఫోకస్ పెట్టారు. మద్యపానం నిషేధం సక్రమంగా అమలుచేస్తూ ఆయన ఎన్టీఆర్ కు అచ్చమైన వారసుడిగా నిలుస్తున్నట్లు టీడీపీ మాజీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ప్రకటించారు. జగన్ పాలనను కీర్తిస్తూ మద్యపాన నిషేధాన్ని స్వాగతించారు. జగన్ పరిపాలనను భేష్ అంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆయనే మాజీ ఎమ్మెల్యే, ముస్లిం సంక్షేమం సంఘం ఉత్తరాంధ్ర అధ్యక్షుడు ఎస్.ఎ రహమాన్ ఇటీవల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ ను పాలనను మెచ్చుకుంటూనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనను తూర్పారపడుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, టీడీపీ నాయకుల తీరుపై మండిపడ్డారు. మీరు రెచ్చిపోతే మీ మీ జాతకాలు మొత్తం బయటపెడతానంటూ హెచ్చరించాడు. జగన్ ముఖ్యమంత్రి గా సుపరిపాలన అందిస్తుంటే సహించలేక కుళ్లుతో జగన్ పై తప్పుడు ఆరోపణలు బాబు గ్యాంగ్ చేస్తున్నారని ఆరోపించారు.
జే టాక్స్ అంటూ జగన్ పన్ను చెబుతున్న టీడీపీ పెద్దలు వాటిని నిరూపించగలరా అని సవాల్ విసిరారు. ఈ క్రమంలో మద్యపాన నిషేధంపై ఆయన స్పందించారు. మద్యపాన నిషేధాన్ని దశలవారీగా జగన్ అమలుచేస్తున్నారని తెలిపారు. ఎన్టీయార్ కి అచ్చమైన వారసుడు అంటూ జగన్ అని అభివర్ణించారు. అప్పట్లో ఎన్టీఆర్ సంపూర్ణ మద్య నిషేధం అమలుచేశారని, అయితే అలా చేసిన ఆయన్ని గద్దె దించేసి మద్య నిషేధం ఎత్తివేసిన చంద్రబాబు అని గుర్తుచేశారు. నాడు లిక్కర్ సిండికేట్ నుంచి ఆరు వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని అప్పటి కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి ఆరోపించిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసి చంద్రబాబు తీరును నిలదీశారు.
ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రవహింపచేశారని, ఆయన ఐదేళ్ల పాలనలో పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్న సంగతి తనకు తెలుసు అని, అవి బయటపెట్టమంటారా అని ప్రశ్నించారు. బాబు సీఎంగా కొన్ని బ్రేవరేజిలకే అనుమతులు ఇచ్చింది ఆయనేనని తెలిపారు. జగన్ ను విమర్శించే ముందు గత ప్రభుత్వంలో మద్యం పేరిట బాబు సహా ఎవరెవరు ఎంతెంత ముడుపులు తీసుకున్నారో బయటపెట్టి అందరి బాగోతాలు ప్రజల ముందు పెడతానని పేర్కొన్నారు. ఈ విధంగా చంద్రబాబుకు మాజీ నాయకుడు ఝలక్ ఇచ్చారు.