ఏపీలో తాను అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మద్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తానని విపక్ష నేతగా ఉన్న సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట గుర్తు ఉంది కదా. ఆ మాట ఇప్పుడు నిజమైపోయింది. ఏపీ పాలనా పగ్గాలు చేపట్టిన జగన్.. త్వరలో తన ఏడాది పాలన మార్కును అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా మద్య నిషేధంపై తాను చెప్పిన మాట ప్రకారం తొలి ఏడాదిలోనే మద్య నిషేదం దిశగా వేసిన అడుగు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఆయన ఘనంగా ప్రకటించారు. ‘మన పాలన- మీ సూచన’ లో భాగంగా సోమవారం మాట్లాడిన జగన్.. మద్య నిషేధం దిశతా తన సర్కారు వేసిన తొలి అడుగే ఘన విజయం సాధించిందని చెప్పారు.
ఈ తొలి విజయంలో తమ సర్కారు ఏమేం సాధించిందన్న విషయాలను జగన్ ఒకింత కూలంకషంగానే చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో తాను అధికారం చేపట్టే నాటికి ఉన్న మద్యం వినియోగం గానీ, మద్యం అమ్మకాలు గానీ ఇప్పుడు లేవని చెప్పారు. గతంలో వారానికి ఐదు బాటిళ్ల మద్యం వినియోగించే వ్యక్తి ఇప్పుడు తమ సర్కారు తీసుకొచ్చిన కట్టడి చర్యల ఫలితంగా వారానికి రెండు బాటిళ్ల వినియోగానికి పరిమితమయ్యారని జగన్ చెప్పారు. ఇందుకు తమ సర్కారు చేపట్టిన చర్యలే కారణమని కూడా జగన్ చెప్పారు. మద్యం విక్రయాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల నుంచి సర్కారీ చేతుల్లోకి తీసుకురావడం, మద్యం విక్రయ సమయాన్ని భారీగా తగ్గించడం - మద్యం ధరలను భారీగా పెంచిన కారణంగా మద్యం వినియోగం గానీ, మద్యం విక్రయాలు గానీ భారీగా పడిపోయాయని జగన్ చెప్పారు. మద్యం ధరలను ఇటీవలే 70 శాతం పెంచేసిన విషయాన్ని చెప్పిన జగన్... మద్యం ధరలు పెరగడానికి ముందే... విక్రయాలు 24 శాతం మేర పడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.
మద్యం విక్రయాలు ఏ మేరకు పడిపోయాయన్న విషయాన్ని కూడా జగన్ గణాంకాలు చెప్పి మరీ వివరించడం గమనార్హం. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ (ఐఎంఎఫ్ఎల్) విక్రయాలు 24 శాతం పడిపోతే.. బీర్ల అమ్మకాలు ఏకంగా 55 శాతం పడిపోయాయని ఆయన వివరించారు. ఇక మద్యం షాపులను కూడా 33 శాతం మేర తగ్గించామని, తాజాగా పెంచిన 70 శాతం ధరల కారణంగా మరో 20 శాతం మేర మద్యం విక్రయాలు పడిపోయి ఉంటాయని చెప్పారు. ఇదిలా ఉంటే... టీడీపీ హయాంలో పల్లెల్లో మద్యం ఏరులై పారిందని, అందుకు బెల్టు షాపులే కారణమని జగన్ చెప్పారు. గ్రామాల్లో బెల్టు షాపులను ఎత్తేస్తే.. మద్యం వినియోగాన్ని తగ్గించవచ్చని, అందుకు తాము మద్యం షాపులను ప్రైవేట్ నుంచి ప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నామని చెప్పారు. ఎప్పుడైతే మద్యం షాపులు ప్రభుత్వం చేతిలోకి వచ్చాయో... అప్పుడే గ్రామాల్లోని 43 వేల బెల్టు షాపులు వాటికవే మూతపడిపోయాయని జగన్ చెప్పారు. మొత్తంగా మద్య నిషేదంలో తమ ప్రభుత్వం వేసిన తొలి అడుగులోనే ఘన విజయం సాదించిందని జగన్ చెప్పారు.