సామాజిక న్యాయం అంటే చేసి చూపిస్తోన్న జ‌గ‌న్‌!

Update: 2019-06-08 06:08 GMT
మాట‌లు చెప్ప‌టం తేలికే. చేత‌ల్లో చేసి చూపించ‌టంలోనే అస‌లు చిక్కంతా. సామాజిక న్యాయం అంటూ అధినేత‌లు చెప్పే మాట‌ల‌కు వారి చేత‌ల‌కు మ‌ధ్య ఎక్క‌డా పొంత‌న క‌నిపించ‌దు. అందుకు భిన్నంగా తొలిసారి ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రం సామాజిక న్యాయం దిశ‌గా ప‌ద‌వుల పంప‌కాల్ని చేప‌డుతుండ‌టం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. అగ్ర‌కులాల‌కు పెద్ద పీట వేయ‌టం.. అణ‌గారిన వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌ని వైనానికి చెక్ చెబుతూ.. జ‌నాభాలో ఎక్కువ శాతం ఉంటే బీసీ.. ఎస్సీ.. ఎస్టీ వ‌ర్గాల‌కు మెజార్టీ మంత్రి ప‌ద‌వుల్ని ఇస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు జ‌గ‌న్.

తాజాగా త‌న మంత్రివ‌ర్గాన్ని ఎంపిక‌లోనూ సామాజిక అంశాల్ని ప్రాతిపదిక‌గా తీసుకున్న ఆయ‌న‌..  ఇత‌ర ప‌ద‌వుల విష‌యంలోనూ ఆయ‌న బ్యాలెన్స్ మిస్ కాకుండా చూడ‌టం విశేషం. మంత్రి ప‌ద‌వుల విష‌యానికి వస్తే అత్య‌ధికంగా ఎనిమిది మంది బీసీలు కాగా.. ఐదుగురు ఎస్సీల‌కు అవ‌కాశం ఇచ్చారు. అదే స‌మ‌యంలో రెడ్డి.. కాపు సామాజిక వ‌ర్గాల నుంచి న‌లుగురుచొప్పున‌.. ఎస్టీ.. క‌మ్మ‌.. క్ష‌త్రియ‌.. వైశ్య వ‌ర్గాల నుంచి ఒక్కొక్క‌రికి కేబినెట్ లో చోటు క‌ల్పించిన జ‌గ‌న్‌.. స్పీక‌ర్ ప‌ద‌విని బీసీ వ‌ర్గానికి కేటాయించారు. ఇక‌.. చోటు ల‌భించ‌ని బ్రాహ్మ‌ణ వ‌ర్గానికి చెందిన నేత‌ను డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని క‌ట్ట‌బెడుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

మంత్రిమండ‌లి కూర్పులో ఊహించ‌ని రీతిలో సామాజిక న్యాయానికి అగ్ర ప్రాధాన్య‌త ఇచ్చిన ఆయ‌న‌.. డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ఐదుగురిని ఎంపిక చేసి ఆశ్చ‌ర్యానికి గురి చేశారు. ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. కాపు.. మైనార్టీ వ‌ర్గాల‌కు చెందిన ఐదుగురిని ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వులకు నియ‌మించ‌నున్నట్లుగా పేర్కొన్నారు. త‌న కాబినెట్ లో ఐదుగురు ఉప ముఖ్య‌మంత్రుల‌కు చోటు క‌ల్పించ‌టం.. అందులో వెనుక‌బ‌డిన వర్గాల‌కు పెద్ద పీట వేసిన వైనం జాతీయ స్థాయిలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌ట‌మేకాదు.. ప‌లు పార్టీల్లో కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది.

మొత్తం పాతిక మంత్రి ప‌ద‌వుల్లో ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీ వ‌ర్గాల‌కు ఏకంగా 14 ప‌ద‌వుల్ని కేటాయించ‌టం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర చ‌రిత్ర‌లో తొలిసారి ఎస్సీ సామాజిక వ‌ర్గానికి ఏకంగా ఐదు మంత్రి ప‌ద‌వుల్ని జ‌గ‌న్ కేటాయించారు. మాల సామాజిక వ‌ర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేల‌కు.. మాదిగ సామాజిక వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రికి అవ‌కాశం ఇచ్చారు.

ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న మంత్రుల సామాజిక నేప‌థ్యం ఇదే..

1. ధర్మాన కృష్ణదాస్‌ (పోలినాటి వెలమ–బీసీ)– శ్రీకాకుళం

2. బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు–బీసీ)– విజయనగరం 

3. పాముల పుష్పశ్రీవాణి (ఎస్టీ)– విజయనగరం 

4. అవంతి శ్రీనివాస్‌ (కాపు)–విశాఖపట్నం 

5. పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ (శెట్టిబలిజ–బీసీ)– తూర్పు గోదావరి 

6. కురసాల కన్నబాబు (కాపు)– తూర్పు గోదావరి 

7. పినిపె విశ్వరూప్‌ (ఎస్సీ–మాల)– తూర్పు గోదావరి 

8. ఆళ్ల నాని (కాపు)– పశ్చిమ గోదావరి

9. తానేటి వనిత (ఎస్సీ–మాదిగ)– పశ్చిమ గోదావరి 

10. చెరుకువాడ శ్రీరంగనాథరాజు(క్షత్రియ)– పశ్చిమ గోదావరి

11. వెల్లంపల్లి శ్రీనివాస్‌ (వైశ్య)– కృష్ణా 

12. కొడాలి నాని (కమ్మ)– కృష్ణా 

13. పేర్ని నాని (కాపు)– కృష్ణా 

14. మేకతోటి సుచరిత (ఎస్సీ–మాల)– గుంటూరు 

15. మోపిదేవి వెంకటరమణారావు (మత్స్యకారుడు–బీసీ)– గుంటూరు

16.బాలినేని శ్రీనివాసరెడ్డి (రెడ్డి)– ప్రకాశం 

17. ఆదిమూలపు సురేష్‌ (ఎస్సీ–మాదిగ)– ప్రకాశం 

18.పాలుబోయిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ (యాదవ–బీసీ)– పీఎస్సార్‌ నెల్లూరు

19. మేకపాటి గౌతమ్‌ రెడ్డి (రెడ్డి)– పీఎస్సార్‌ నెల్లూరు

20. షేక్‌ బేపారి అంజాద్‌ బాషా(ముస్లిం–బీసీ)– వైఎస్సార్‌ జిల్లా 

21. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (రెడ్డి)– చిత్తూరు 

22. కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ–మాల)– చిత్తూరు 

23. బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి (రెడ్డి)– కర్నూలు 

24. గుమ్మనూరు జయరామ్‌ (బోయ–బీసీ)– కర్నూలు 

25. మాలగుండ్ల శంకరనారాయణ (కురుబ–బీసీ)– అనంతపురం   

Tags:    

Similar News