జగన్ మనసులో మాట: ఏపీ రాజధాని విశాఖేనా?

Update: 2019-12-27 11:19 GMT
ఎన్ని వేల కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమని తాజా కేబినెట్ భేటిలో సీఎం జగన్ మంత్రులకు హితబోధ చేసినట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు అమరావతిని హైదరాబాద్ లా మార్చలేమన్న వాస్తవాన్ని గుర్తించి ప్రజలకు వివరించాలని ఆయన విడమరిచి చెప్పారట..

దీన్ని బట్టి ఏపీ రాజధానిగా అమరావతిని మారుస్తారని జగన్ చెప్పకనే చెప్పారని అర్థమవుతోంది. ఇప్పటికే విశాఖను ఏపీకి పరిపాలన రాజధానిగా చేస్తారని వార్తలు వస్తున్నాయి. అమరావతికి 1.05 కోట్లు పెట్టి అభివృద్ధి చేసే బదులు అందులో 10శాతం నిధులు విశాఖకు పెడితే మరో హైదరాబాద్ లా అభివృద్ధి చేయొచ్చని జగన్ చెప్పారట..

దీన్నిబట్టి ఏపీకి  భవిష్యత్తు రాజధానిగా విశాఖ బెటర్ అని సీఎం జగన్ తోపాటు మంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అమరావతికి లక్ష కోట్లు కంటే 10 కోట్లు పెట్టి విశాఖలో భవనాలు ఏర్పాటు చేసుకుంటే రాజధాని రూపును సంతరించుకోవచ్చు. పైగా అప్పుల్లో ఉన్న ఏపీకి ఇదో గొప్ప ఊరట.. ఆ లక్ష కోట్లను ప్రజాసంక్షేమానికి వాడితే వారి బతుకులు బాగుపడతాయి. ప్రస్తుతం అప్పులు తెచ్చి రాజధాని కట్టే పరిస్థితుల్లో ఏపీ లేదన్నది వాస్తవం. దీన్ని బట్టి భవిష్యత్ రాజధాని విశాఖేనని జగన్ అండ్ కో దాదాపు నిర్ణయించారని చెప్పవచ్చు.
Tags:    

Similar News