రాజకీయాల్లో తనకిలాంటి అనుభవం ఎదురవుతుందని జగన్ బాబు అస్సలు ఊహించరు. తాను విజిలేస్తే.. సర్కారులు ఉలిక్కిపడతాయని.. ఉక్కిరిబిక్కిరి అవుతాయని.. ప్రభుత్వాన్ని పడగొట్టటం తనకు గంట పని అన్న మైండ్ సెట్ లో ఉండటం జగన్ కు మాత్రమే సాధ్యం. తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవటం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు అలవాటే.
తన చుట్టూ ఉన్న వారంతా.. తన తండ్రి దశాబ్దాల పాటు నడిపిన రాజకీయం కారణంగా తనతో ఉన్నారే తప్పించి.. తన తెలివితేటలతో కాదన్న విషయాన్ని జగన్ పెద్దగా పట్టించుకోరు. అందుకే.. ఏదైనా విషయం మీద మాట్లాడాలని పార్టీ నేతలు సంప్రదించే ప్రయత్నం చేస్తే అందుబాటులోకి రారు. తనకు తోచినప్పుడు పార్టీ నేతలతో మాట్లాడటం.. తనకు నచ్చినప్పుడే వారిని దగ్గరకు రానివ్వటం లాంటివి జగన్ ట్రేడ్ మార్కులు.
ఇలాంటి వైఖరి రాజకీయాల్లో అస్సలు పనికి రాదని.. అందులోనూ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఏ మాత్రం అక్కరకు రావన్న విషయం జగన్ కు అర్థం కాదు. ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలన్న ప్రయత్నం కూడా ఎవరూ చేయరు. జగన్ వైఖరి పార్టీకి నష్టం వాటిల్లేలా చేస్తుందన్న విషయం పార్టీ పెద్దలకు తెలిసినా.. జగన్ దగ్గర ప్రస్తావించే దమ్ము.. ధైర్యం వారిలో ఎవరికి లేవు. దీంతో అడుగులకు మడుగులు వత్తించుకోవటమే జగన్ కు అలవాటైంది. అంతేకానీ.. లెక్క తేడా వస్తే పార్టీ నేతల గడ్డాలు పట్టుకొని బతిమిలాడాల్సి ఉంటుందన్నది ఆయనకు అనుభవంలో లేని వ్యవహారం.
ఈ కారణం చేతనే.. తాజాగా చోటు చేసుకున్న పార్టీ పరిస్థితులపై ఆయన బిత్తర పోతున్నారు. తనను పలకరించే ప్రయత్నం చేసే నేతలతో మాట్లాడాలా? వద్దా? అని డిసైడ్ చేయటమే తప్పించి.. తనకు తానుగా ఒక నేతతో అర్జెంట్ గా మాట్లాడాలన్న పరిస్థితిని ఆయన ఊహించి ఉండరు. ఒకవేళ మాట్లాడాలనుకుంటే నిమిషాల్లో తన దగ్గరకు రెక్కలు కట్టుకొని వాలిపోతారన్న నమ్మకం నుంచి.. తాను ఎంతగా ట్రై చేసినా.. కనీసం మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వని నేతలు పార్టీలోఉన్నారన్న అనుభవం జగన్ కు ఏమాత్రం ఊహించలేదు.
తాజాగా పార్టీ నుంచి వీడిపోయి.. ఏపీ అధికారపక్షంతో చెట్టాపట్టాలు వేసుకునేందుకు.. సైకిల్ ఎక్కేందుకు తండ్రీ కూతుళ్లు (భూమా నాగిరెడ్డి.. అఖిలప్రియ) సిద్ధమయ్యారని తెలిసి.. వారితో మాట్లాడేందుకు ప్రయత్నించిన జగన్ కు కనీసం తనతో మాట్లాడేందుకు భూమా ఇష్టపడకపోవటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. ఇలాంటి షాకింగ్ సిచ్యువేషన్ జగన్ కు కొత్త అనుభవమని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తేడా వస్తే.. జగన్ కంటే మహా మొండిగా వ్యవహరించే భూమాలోని మరో కోణం జగన్ కు ఇప్పుడే అనుభవంలోకి రావటం.. తనకు తాను మాట్లాడాలనుకున్నా.. మాట్లాడకుండా ముఖం చాటేసే పార్టీ నేతలు ఉండటం జగన్ ను తీవ్రంగా కలిచివేస్తోందట. తన వైఖరితో భూమా ఇచ్చిన షాక్ కి ఉక్కిరిబిక్కిరి అయిన జగన్.. అందులో నుంచి ఒక పట్టాన బయటపడ లేకపోతున్నారని తెలిసింది. రాజకీయాల్లో ఇప్పటివరకూ ఒక కోణాన్ని మాత్రమే చూసిన జగన్ కు.. ఇప్పుడు మరో కోణం అనుభవంలోకి వస్తుందని.. ఇది ఆయన వైఖరిని ఎలా మారుస్తుందో చూడాలని జగన్ పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకుంటున్నారు.