ప్రత్యర్ధుల మీద యుద్ధం ప్రకటించి అందులో విజయం వైపుగా సాగుతూపోవాలని అందరికీ ఉంటుంది. అది మజాను ఇచ్చే భలే క్రీడ. తన సొంత గడ్డలో బంగళా కట్టుకుంటే ఏముంది ప్రత్యర్ధి కోటలో కుర్చీ వేసుకుని కూర్చుంటే వచ్చే కిక్కే వేరబ్బా. ఇపుడు ఏపీలో అదే రకమైన మజా రాజకీయం సాగుతోంది.
ముఖ్యమంత్రి జగన్ కి పులివెందుల సొంత నియోజకవర్గం. ఆయన ఏవో కారణాల కార్యక్రమాల మీద పులివెందుల తరచుగా వెళ్ళి వస్తూంటారు. అయితే అది ఒక మాదిరి కిక్ మాత్రమే ఇస్తుంది. కానీ జగన్ ఇపుడు మరో ప్లేస్ కి వెళ్తున్నారు. అది చిత్తూరు జిల్లా కుప్పం. తమిళనాడు బోర్డర్ లో ఉండే కుప్పం ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే జగన్ కి ఎక్కడ లేని ఉత్సాహం ఇపుడు వస్తోంది.
కుప్పంలో బాబు మెజారిటీని 2019 ఎన్నికల్లో తగ్గించిన వైసీపీ ఆ తరువాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో సైకిల్ పార్టీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అన్నీ తన ఖాతాలో వేసుకుంది. దాంతో ధీమా బాగా పెరిగింది. ఇక బాబు పని కుప్పంలో ఇంతే సంగతులు అని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు
జగన్ సైతం ఎమ్మెల్యేల వర్క్ షాప్ లో కుప్పం సహా మొత్తానికి మొత్తం 175 అసెంబ్లీ సీట్లను గెలిచి తీరాలని పట్టుదల పట్టారు. ఇక కుప్పం అంటే జగన్ కి టాప్ ప్రయారిటీ అయిపోయింది. చంద్రబాబును మాజీ సీఎం ని చేసిన తాను మాజీ ఎమ్మెల్యేను చేయలేనా అన్నదే ఆయన ఆలోచన. అందుకే కుప్పం అంటే చాలు ఫస్ట్ అనేస్తారు. ఈ మధ్యన క్యాడర్ తో మీటింగ్ అంటే కుప్పానికే తొలి చాన్స్ ఇచ్చారు.
ఆ సమావేశంలో కుప్పంలో సమస్యల పరిష్కారానికి అభివృద్ధి పనులకు ఏకంగా 66 కోట్ల రూపాయల నిధులను జగన్ విడుదల చేశారు. ఇపుడు ఆ నిధులతో మొదలెట్టబోతున్న అభివృద్ధి పనులకు జగన్ శ్రీకారం చుడతారు. ఈ నెల 22న జగన్ కుప్పం టూర్ ఉంది. దాంతో రాజకీయంగానూ ఇది ఆసక్తిని పెంచుతోంది. ఎందుకంటే చంద్రబాబు ఆగస్ట్ నెలాఖరులో కుప్పంలో మూడు రోజుల పాటు టూర్ చేశారు. ఆ టైం లో టీడీపీ వైసీపీ మధ్య ఎంతటి పెద్ద యుద్ధం జరిగిందో అంతా టీవీల సాక్షిగా కళ్లారా చూశారు.
మరిపుడు ముఖ్యమంత్రి కుప్పం వెళ్తున్నారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో ఊరుకోరు కదా. గతంలో చంద్రబాబు ఏమీ చేయలేదని గట్టిగానే విమర్శలు చేస్తారు. మరి కుప్పంలో టీడీపీ శ్రేణులు మిన్నకుంటాయా. వారికి ఆ పార్టీ ఆదేశాలు ఇవ్వకుండా ఉంటుందా. మరి సీఎం టూర్ ని అడ్డుకునే ప్లాన్ రచ్చ చేసే వ్యూహాలు ఏమైనా టీడీపీ వద్ద ఉన్నాయా అంటే చూడాలి. ఏది ఏమైనా జగన్ కుప్పం టూర్ కి అంతా సిద్ధమైపోయింది.
చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం టూర్ చేసి గట్టిగా నెల రోజులు తిరగకుండానే జగన్ వెళ్తున్నారు. రాజకీయ వేడి ఆరకుండానే సీఎం అక్కడ అడుగుపెడుతున్నారు. సో మరోసారి కుప్పం వైపుగా టోటల్ మీడియా కన్ను వేయాల్సిందే. రాజకీయ విశ్లేషణలు, చర్చలూ అన్నీ కూడా ఆ దిశగా సాగాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.