ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రీం టీం వివరాలు బయటకు వచ్చాయి. చారిత్రక విజయం నేపథ్యంలో భారీగా పదవులు ఆశిస్తున్న నేతల నడుమ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ప్రత్యేకతను సొంతం చేసుకున్నారు పాతికమంది. మొత్తం175 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 151 స్థానాల్లో విజయంసాధించిన ఎమ్మెల్యేల్లో పాతిక మందిని మంత్రివర్గం కోసం ఎంపిక చేయటం అంత తేలికైన విషయం కాదు. ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలలో ఒక్కరికి మాత్రమే మంత్రి పదవి దక్కే పరిస్థితి.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సామాజిక సమీకరణాలు.. జిల్లాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం లాంటి ఎన్నో కాంబినేషన్లు ఉంటాయి. ఇలాంటి అడ్డంకుల్ని అధిగమించిన జగన్ జట్టులోచోటు దక్కించుకున్న మంత్రుల ప్రొఫైల్స్ ను పరిశీలించినప్పుడు ఆసక్తికర అంశాలు కనిపించాయి.
జగన్ జట్టులో చోటు దక్కించుకున్న వారిలో అత్యధికులు మధ్య వయస్కులు కావటం విశేషం. మొత్తం పాతిక మందిలో యాభై కంటే తక్కువ వయసు ఉన్న వారు ఏకంగా 13 మంది. అంటే.. యాభై శాతానికి మించిన మంత్రులు యాభై కంటే తక్కువ ఉన్న వారు. ఇంకాస్త వివరంగా వెళ్లాలంటే 45 ఏళ్లు.. అంతకంటే తక్కువ ఉన్న వారు ఆరుగురు వరకు ఉన్నారు. వయసులో అత్యంత పిన్న వయస్కులుగా పాముల శ్రీవాణిని చెప్పాలి. విజయనగరం జిల్లా కురుపాం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె వయసు కేవలం 31 ఏళ్లు మాత్రమే.
అదే సమయంలో మంత్రివర్గంలో అత్యంత పెద్ద వయస్కులుగా తూర్పు గోదావరి జిల్లాలోని మండపేట అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్ ను చెప్పాలి. ఆయన వయసు 69 ఏళ్లు. క్లీన్ చిట్ ఉన్న నేతగా ఆయన్ను అభివర్ణిస్తుంటారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిల్లి.. వైఎస్ హయాంలో మంత్రిగా వ్యవహరించారు.
ఇక.. జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మంత్రుల విద్యార్హతల్ని చూస్తే.. ఒకరు పీహెచ్ డీ చేయగా.. బీడీఎస్.. బీఈ చేసిన వారు ఒక్కొక్కరున్నారు. పీజీ చేసిన వారు నలుగురు ఉండగా.. డిగ్రీ చేసిన వారు ఏకంగా డజన్ మంది ఉన్నారు. ఇంటర్ విద్యార్హతగా ఉన్న వారుముగ్గురు కాగా.. టెన్త్ మాత్రమే విద్యార్హతగా ఉన్న వారు ముగ్గురు ఉన్నారు.
జగన్ జట్టులో ఉన్నత విద్యావంతులే ఎక్కువగా చెప్పాలి. పాతికమంది మంత్రుల్లో కేవలం ఆరుగురు మాత్రం ఇంటర్.. అంతకంటే తక్కువ విద్యార్హత ఉన్నవారు కావటం గమనార్హం.
+ మంత్రుల విద్యార్హత
పదోతరగతి: 3
ఇంటర్: 3
డిగ్రీ: 12
పీజీ: 4
బీడీఎస్: 1
బీఈ: 1
పీహెచ్ డీ: 1
+ వయసుల వారీగా మంత్రుల్ని చూస్తే..
35లోపు: 1
40 లోపు:1
45 లోపు:1
50 లోపు : 10
55 లోపు: 5
60 లోపు: 2
65 లోపు: 2
70 లోపు: 3