బాబుకు బీపీ మరింత పెరిగేలా మరో హామీని నెరవేర్చిన జగన్

Update: 2019-11-11 13:24 GMT
అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగు నెలలు మాత్రమే అయినప్పటికీ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటిగా తీరుస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దూసుకెళుతున్నారు. ఎన్నికలకు ముందు ఆయన నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా.. సమాజంలోని వివిధ వర్గాలను కలుసుకున్న ఆయన.. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకునేవారు. తాము అధికారంలోకి వచ్చినంతనే సమస్యల్ని తీరుస్తామంటూ హామీ ఇచ్చేవారు.

చెప్పనట్లే.. తాను పవర్లోకి వచ్చిన తర్వాత నుంచి ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తోంది జగన్ సర్కార్. అంచనాలకు ఏ మాత్రం అందని రీతిలో అనేక హామీల్నిఇప్పటికే నెరవేర్చటం ద్వారా ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు దడ పుట్టేలా చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో బాబు ఇచ్చిన హామీల్లో 50 శాతం కూడా తన ఐదేళ్ల పదవీ కాలంలో చేయని తీరుకు భిన్నంగా జగన్ పాలన సాగుతోంది.

దీంతో.. ప్రతి విషయంలోనూ జగన్ సర్కారు తీరును తప్పు పడుతున్నారు చంద్రబాబు. ఇదిలా ఉంటే.. తాజాగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీవోఏ).. మెప్మా..యానిమేటర్లు.. సంఘమిత్రాల వేతనాన్ని రూ10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేశారు.

ఈ పెరిగిన వేతనం డిసెంబరు 1 తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఈ వార్త తెలిసినంతనే ఆయా వర్గాలకు చెందిన ఉద్యోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజా నిర్ణయంతో ఏపీ విపక్ష నేత చంద్రబాబుకు బీపీ డబుల్ కావటం ఖాయం. తామెంత డ్యామేజ్ చేయాలని భావిస్తున్నా.. సాధ్యం కాకపోవటమే కాదు.. రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతున్న జగన్ తీరు ఆయనకు ఒక పట్టాన కొరుకుడుపడని రీతిలో మారుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News