అధికారంలో ఉన్న వేళ అసంతృప్తి సహజం. అధికార పార్టీ నేతలందరికి పదవులు దక్కటం సాధ్యం కాదు. ఇలాంటి సందర్భాల్లో నేతల్ని సమాధానపరిచి.. వారిని ఒక తాటి మీద నడిపించాల్సిన బాధ్యత పార్టీ అధినేత మీద ఉంటుంది. అయితే.. ప్రయత్నాలు ఎన్ని చేసినా లోకల్ పంచాయితీల్ని తీర్చటం అంత తేలికైన ముచ్చట కాదు. కానీ.. వాటి సంఖ్య పెరుగుతున్నకొద్దీ.. పార్టీ ఇమేజ్ కు జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కోస్తాలో అధికార వైసీపీ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది.
కోస్తాలో వైసీపీకి కంచుకోట అన్నంతనే గుర్తుకు వచ్చే జిల్లా ఉమ్మడి నెల్లూరు. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జిల్లాలో పార్టీ స్వరూపమే మారిపోయిన పరిస్థితి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రాం నారాయణ రెడ్డి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై వైసీపీ అధినాయకత్వం సస్పెన్షన్ వేటు వేయటం తెలిసిందే. మేకపాటి ఫ్యామిలీకి చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు అధికార పార్టీ మీద వార్ డిక్లేర్ చేయటం తెలిసిందే.
మేకపాటి కుటుంబంలో ఇలాంటి పరిస్థితి ఉంటే.. మాజీ మంత్రి.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఆయన బాబాయ్ అయిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ తో పాటు నుడా ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరే కాకుండా అనిల్ కు 2019 ఎన్నికల్లో అండగా నిలిచిన వారిలో పలువురు ఇప్పుడాయనకు వ్యతిరేకంగా ఉన్నారు. గూడూరు నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గ్రూపులు సాగుతున్నాయి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వస్తే.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిల వర్గాల మధ్య నడుస్తున్న పోరు అంతకంతకూ పెరగటమే తప్పించి తగ్గని పరిస్థితి. బాలినేని వ్యతిరేక వర్గంగా పేరున్న రావి రామనాథం బాబును పర్చూరు నియోజకవర్గ సమన్వయ బాధ్యతల నుంచి తప్పించారు. తాజాగా పర్చూరు బాధ్యుడిగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ ను నియమించారు.
దర్శి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కు..నియోజకవర్గంలోని రెడ్డి సామాజిక వర్గానికి మధ్య దూరం పెరుగుతోంది. దీని పరిణామాలు ఏ రీతిలో ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. సంతనూతల పాడులో ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని ప్రధాన సామాజికవర్గాలకు చెందిన వారంతా కలిసి ఆత్మగౌరవ సభ పెట్టుకునే వరకు వెళ్లింది. నియోజకవర్గంలో దాదాపు 60 వేల ఓట్లు ఉన్న కీలక సామాజిక వర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలు.. చోటా నేతలు కలిసి ప్రత్యేకంగా సమావేశమై.. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తమ గోడును వెళ్లబోసుకోవటమే కాదు.. తామంతా ఆయనకు వ్యతిరేకంగా ఉండాలనుకోవటం గమనార్హం.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని చీరాలలో టీడీపీ తరఫు గెలిచి వైసీపీ జై కొట్టిన ఎమ్మెల్యే కరణం బలరామ క్రష్ణ మూర్తి.. పోతుల సునీత మాజీ ఎమ్మెల్యే ఆమంచి గ్రూపులు ఉన్నాయి. బలరాం కొడుక్కి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పజెప్పా.. ఆమంచిని పర్చూరు పంపి.. పోతుల సునీతకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టినా.. చీరాల మీద అధిపత్యం కోసం ఈ ముగ్గురు ఎవరి పావులు వారు కదుపుతున్నారు. ముగ్గురికి సమన్యాయం చేశామని అధినాయకత్వం భావిస్తుంటే గ్రౌండ్ లెవల్ లో పరిస్థితి మరోలా ఉండటం గమనార్హం. అద్దంకి.. కనిగిరి.. మర్కాపురం నియోజకవర్గాల్లో అధికారపార్టీలో గ్రూపు పంచాయితీలకు కొదవ లేదు. ఈ పరిణామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారతాయన్న మాట వినిపిస్తోంది.
ఉమ్మడి గుంటూరు జిల్లా విషయానికి వస్తే.. మంత్రి అంబటి రాంబాబుకు స్థానిక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంబటి వ్యతిరేకులంతా కలిసి వచ్చే ఎన్నికల్లో అంబటికి టికెట్ రాకుండా చూడాలన్న పట్టుదలతో ఉన్నారు. మరో మంత్రి విడుదల రజినికి పార్టీ సీనియర్ నేత మర్రి రాజశేఖర్ కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే సీటు త్యాగం చేసినందుకు రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇవ్వటం.. అదేమీ జరగకపోవటం.. తీరా ఆమెకు మంత్రి పదవి దక్కటంపై ఆయన గుర్రుగా ఉన్నారు. దీంతో ఆయన.. నరసరావుపేట ఎంపీ శ్రీ క్రిష్ణదేవరాయులు కలిసి గ్రూపుగా మారారు. మంగళగిరి, తాడికొండ, గుంటూరు పశ్చిమ లో అధికార పార్టీ నేతల మధ్య గ్రూపుల పంచాయితీ ఎక్కువగా ఉన్నాయి. వీరిమధ్య రాజీ కుదిర్చి ఎన్నికల నాటికి అందరిని ఏకం చేయాల్సిన అవసరం ఉంది.
ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోనూ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. గన్నవరంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించటం తెలిసిందే. 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు మరో వైసీపీ నేత దుట్టా రామచంద్రరావు వంశీని వ్యతిరేకిస్తున్నారు. ఎంపీ బాలశౌరి.. ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య అధిపత్య జోరు పీక్స్ కు చేరింది. మచిలీపట్నం పోర్టు శంకుస్థాపనకు సంబంధించి ఎంపీ.. ఎమ్మెల్యేలు చేస్తున్న విరుద్ధ ప్రకటనలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
విజయవాడ నగర వైసీపీ బొప్పన కుమార్ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానులు ఓపెన్ గా తిట్టుకోవటం తెలిసిందే. వీరిద్దరి పంచాయితీ ఒక పట్టాన తెగట్లేదు. విజయవాడ సెంట్రల్ లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్.. ఎమ్మెల్సీ రుహుల్లా మధ్య అధిపత్య పోరు జోరుగా ఉంది. విజయవాడ తూర్పులోనూ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా వ్యవహరిస్తున్న దేవినేని అవినాష్ కు.. యలమంచలి రవి.. బొప్పన భవ కుమార్ మధ్య పోటాపోటీనడుస్తోంది. ఈ వర్గాల పోరు పార్టీకి మంచిది కాదంటున్నారు.
పాలకొల్లుతో అధికార వైసీపీలో ఐదు గ్రూపులు ఉండటం గమనార్హం. ఎమ్మెల్సీ మేకా శేషు బాబు.. పార్టీ బాధ్యుడిగా పని చేసిన గుణ్ణం నాగబాబుకు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీలోకి వచ్చిన డాక్టర్ బాబ్జీకి టికెట్ ఇచ్చినా ఓడారు. ఆచంట సీటు సర్దుబాటు కోసం కవురు శ్రీనివాస్ ను పక్కన పెట్టి.. ఆయన్ను ఛైర్మన్ చేశారు. అనంతరం పాలకొల్లుకు తీసుకొచ్చి నియోజకవర్గ పార్టీ బాధ్యుడిగా నియమించారు. తాజాగా ఎమ్మెల్సీని చేశారు. మరోపక్క యడ్ల తాతాజీ టికెట్ ఆశిస్తున్నారు. ఇలా ఐదుగురు పార్టీ టికెట్ కోసం చేస్తున్న ప్రయత్నాలు చివరకు ఎక్కడి వరకు వెళతాయన్నది ప్రశ్నగా మారింది.
కొవ్వూరు విషయానికి వస్తే హోం మంత్రి తానేటి వనిత వెంట ఉన్న నాయకులంతా ఇప్పుడు దూరమయ్యారు. ఒక సామాజిక వర్గానికి చెందిన వారంతా ఒక గ్రూప్ గా మారి.. కొవ్వూరు సీటును ఆశిస్తున్న మండలి ఛైర్మన్ మోషేనురాజుకు మద్దతుగా నిలుస్తున్నారు. మంత్రి చెల్లబోయిన వేణుగోపాల క్రిష్ణ.. ఎంపీ సుభాష్ చంద్రబోస్.. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గాల మధ్య పోటీ త్రిముఖంగా మారింది. వచ్చే ఎన్నికల్లో బోస్ కొడుక్కి టికెట్ వస్తుందన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు తోట త్రిమూర్తులు రామచంద్రపురాన్ని వదలట్లేదు. దీంతో.. ఇక్కడ గ్రూపుల బెడద ఎక్కువగా ఉంది.
మైలవరం పంచాయితీలో ముఖ్యమంత్రే స్వయంగా జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య రాజీ కోసంప్రయత్నాలు చేశారు. అయినా ఫలించని పరిస్థితి. ఎమ్మెల్యే వసంత క్రష్ణప్రసాద్.. మంత్రి జోగి రమేశ్ వర్గాల మధ్య తగదాలకు చెక్ పడలేదు. సోషల్ మీడియాలో రచ్చ చేసుకోవటానికి వెనుకాడటం లేదు. ఏలూరు ఎంపీగా వ్యవహరిస్తున్న కోటగిరి శ్రీధర్.. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మధ్య ఉన్న పంచాయితీ తీరలేదు. వీరిద్దరి వర్గీయుల మధ్య నడుస్తున్న అధిపత్య పోరు పార్టీకి చేటు ఖాయమంటున్నారు. రాజమహేంద్రవరం విషయానికి వస్తే ఎంపీ భరత్ కు.. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా..ఆకుల వీర్రాజు గ్రూపులు ఉన్నాయి. ఇటీవల పార్టీ బాధ్యుడిగా చందన నాగేశ్వర్ ఎంపిక కావటంతో.. గ్రూపుల సంఖ్య మరింత పెరిగింది. ప్రత్తిపాడు.. పి.గన్నవరం.. పెద్దాపురం నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీలో గ్రూపుల గట్టిగానే ఉన్నాయి.