హంగులూ ఆర్భాటాలు లేవు. అప్పీరియన్స్ లోనూ - మాటల్లోనూ చాలా సాదాసీదాగా.. గడ్డంలో ఉన్న రఫ్ నెస్ కూడా మాటల్లో వినిపించడం లేదు. నవ్వుతూనే కనిపిస్తూ కఠినమైన నిర్ణయాలనూ తీసుకుంటూ.. ఒకవైపు ప్రజలను వరాలను కురిపిస్తూ ఇంకో వైపు ప్రత్యర్థులకు వణుకుపుట్టిస్తూ.. ఇలా సాగుతోంది ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన! వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు గడిచాయి. అంతకు ముందు వారం కిందట విడుదల అయిన ఎన్నికల ఫలితాల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలన విజయం సాధించింది. ఏకంగా నూటా యాభై ఒక్క సీట్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి సంచలన విజయాన్ని జగన్ పార్టీకి కట్టబెట్టారు ఏపీ ప్రజలు.
అక్కడ నుంచినే 'సీఎం జగన్' ప్రస్థానం మొదలైనట్టు! విజయం రాగానే స్పందించడంతోనే జగన్ తీరుపై అందరి దృష్టీ పడింది. ఆయన ఏం మాట్లాడారు? ఏం ప్రకటిస్తారు? విజయాన్ని ఎలా తీసుకుంటారు? ప్రత్యర్థుల గురించి ఏం మాట్లాడతారు? అనేవి సర్వత్రా ఆసక్తిదాయకంగా నిలిచాయి.
జగన్ కు ఈ విషయం ఊరికే దక్కలేదు. తొమ్మిదేళ్ల పోరాటం అనంతరం వైఎస్ జగన్ కు విజయం దక్కింది. ఒక దఫా ఇక అధికారం అందుకోవడమే తరువాయి అనే పరిస్థితుల్లో త్రుటిలో విజయాన్ని కోల్పోయారు. అంతకు ముందు, ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి ఎన్నో కష్టనష్టాలను భరించాల్సి వచ్చింది.
ఒకవైపు తను కొన్ని నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. మరోవైపు తన తల్లి - చెల్లెలు - భార్య.. తన కుటుంబం అంతా అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. అయినా వాటిలో వేటినీ వెరవక జగన్ మోహన్ రెడ్డి పోరాడారు. కేంద్ర ప్రభుత్వాలతో - రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడి.. గెలిచి నిలిచారు జగన్ మోహన్ రెడ్డి. అలాంటి పరిణామాల మధ్యన విజయం దక్కితే ఎవరైనా రీవేంజ్ కు ప్రాధాన్యం ఇస్తారు. తనను ఇక్కట్ల పాల్జేసిన వారిపై ప్రతీకార చర్యలకే మొదట ప్రాధాన్యతను ఇస్తారు.
అయితే వైఎస్ జగన్ లో మాత్రం ఆ తీరు ఏ మాత్రం కనిపించకపోవడం గమనార్హం! ఘన విజయం దక్కినా జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా అహాన్ని ప్రదర్శించడం లేదు. తన కలల పీఠం దక్కినా జగన్ మాత్రం నింపాదిగానే వ్యవహరిస్తూ ఉన్నారు. పదవి దక్కిందని ప్రతీకార చర్యల జోలికి వెళ్లకుండా.. తనకు దక్కింది ప్రజాసేవకు మాత్రమే అనే తీరును కనబరుస్తూ ఉన్నారు.
ఈ రోజుల్లో 'ప్రజాసేవ' అనేది ఒక కామెడీ పదం అయిపోయింది. ఆ పరిస్థితుల్లో జగన్ నిజంగానే మార్పును చూపించే దిశగా సాగుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మీడియాతో సుదీర్ఘ సంభాషణలు లేవు. పొడిపొడిగానే మాట్లాడినా - ప్రసంగాలు కూడా లెంగ్తీ కాకుండా కుదించిన జగన్ మోహన్ రెడ్డి పలికిన పలుకులు మాత్రం అందరూ గుర్తుండిపోయేలా మాట్లాడుతూ ఉన్నారు. 'ఆరు నెలల్లోనో - ఏడాదిలోనో.. మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా..' అని జగన్ మాట్లాడటం.. డైలాగ్ ఆఫ్ ద ఇయర్ అనిపించుకుంటోంది. ఇన్ని రోజులూ 'ఒక్క అవకాశం ' అడిగిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానంటూ ప్రకటించారు. మరో అవకాశాన్ని అడగడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటానని అంటున్నాడు. రాజకీయాన్ని జగన్ వ్యాపారంగానో - అధికారాన్ని ప్రతీకారానికో వాడుకునే ధోరణిని ఏ మాత్రం కనబరచకపోవడం గమనార్హం. ఇదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను క్షమించేది లేదని మాత్రం జగన్ తేల్చి చెబుతున్నారు. చట్టం తన పని తను చేసుకుపోతుందని తేల్చి చెబుతున్నారు.
సీఎంగా జగన్ వ్యవహరణ తీరు భేషుగ్గా ఉంది. అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తేనే చాలు. అధికారం అందగానే జగన్ ప్రవర్తిస్తున్న తీరు.. నిండుకుండలా ఉంది. ఏ మాత్రం తొణకకుండా - బెనకకుండా సాగుతున్న జగన్ మోహన్ రెడ్డి ఇదే తీరును కొనసాగితే మాత్రం చరిత్రలోనే బెస్ట్ సీఎంగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తూ ఉంది.
మంత్రి వర్గ ఏర్పాటు విషయంలో కూడా ఐదుగురు డిప్యూటీ సీఎంలు అంటూ.. జగన్ చేసిన ప్రతిపాదన అత్యంత ఆసక్తిదాయకంగా ఉంది. వెనుకబడిన కులాల వారికి అలాంటి అత్యున్నత హోదాలు ఇవ్వడం సమాజంలోనూ ఒక సానుకూల ధోరణిని చాటుతోంది. ఏదో తమకు ఓటేస్తారనే కులానికో డిప్యూటీ సీఎం అనకుండా.. కాపు - మైనారిటీ - ఎస్సీ - ఎస్టీ - బీసీ..అంటూ అన్ని వర్గాలకూ సమ ప్రాధాన్యం ఇస్తున్నారు జగన్.ఇలా ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు. బహుశా దేశంలోనే ఇలా ఎవరూ చేసి ఉండరేమో. నిజంగానే ఒక యువకుడికి - దార్శానికత ఉన్న - ఓపికైన నేతకు - మంచి ఆలోచన శక్తి - మంచి కమ్యూనికేషన్ ఉన్న నేతకు పదవి ఇస్తే రాజ్యం కచ్చితంగా బాగుపడుతుంది. బాగుపడాలి కూడా!