ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? ప్రతి రోజూ సచివాలయానికి వెళ్లేందుకు వాహనాల కాన్వాయ్ ను పక్కన పెట్టేసి.. హెలికాఫ్టర్ లో వెళ్లాలనుకుంటున్నారా? అంటే.. అవునన్న మాట వినిపిస్తోంది. తాడేపల్లిలోని జగన్ నివాసం నుంచి సచివాలయానికి కార్ల సముదాయంలో వెళుతున్నారు ఏపీ సీఎం జగన్.
అయితే.. కాన్వాయ్ కారణంగా అక్కడి ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లుగా జగన్ భావిస్తున్నారు. నిత్యం సీఎం కాన్వాయ్ కారణంగా తరచూ ట్రాఫిక్ ఆంక్షలు అక్కడి వారు ఎదుర్కొంటున్నారు. తన కాన్వాయ్ కారణంగాప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు పెట్టొద్దని పోలీసులకు జగన్ స్పష్టం చేసినప్పటికి భద్రతా పరమైన చర్యల్ని తప్పక పాటించాల్సి పరిస్థితి.
ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు వీలుగా కీలక నిర్ణయాన్ని జగన్ తీసుకున్నట్లుగా చెబుతున్నారు. తాడేపల్లిలోని ఇంటి నుంచి సచివాలయానికి హెలికాఫ్టర్ లో వెళితే.. ట్రాఫిక్ ఇబ్బందులు తీరటంతో పాటు.. ప్రజలకు ఎలాంటి కష్టం ఉండదన్న ఆలోచనలో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు.
ఇందులో భాగంగా జగన్ ఇంటి వద్ద హెలికాఫ్టర్ ట్రయల్ రన్ ను నిర్వహించారు. జగన్ నివాసానికి ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న పాత ప్యారీ కంపెనీ స్థలంలో అధికారులు ఇటీవల కొత్త హెలిప్యాడ్ ను సిద్ధం చేయటం తెలిసిందే. ఇక్కడ నుంచి సచివాలయానికి నేరుగా హెలికాఫ్టర్ లో ప్రయాణించటం కారణంగా ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఆ మధ్య విడుదలైన విజయవంతమైన భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో నటించిన హీరో ఇంటి నుంచి సచివాలయానికి.. సచివాలయం నుంచి ఇంటికి హెలికాఫ్టర్ లో ప్రయాణించినట్లుగా జగన్ కూడా ఉంటారని చెప్పక తప్పదు.