జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ ఆగస్టు 20న కడప జిల్లాలోని సిద్ధవటంలో పర్యటిస్తారు. అక్కడ ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. ఈ నేపథ్యంలో పవన్ తన కడప జిల్లా పర్యటనలో ప్రభుత్వంపై, వైఎస్ జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోననే దానిపై అందరి ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే పవన్ కల్యాణ్ తన కౌలు రైతు భరోసా యాత్రను ప్రకాశం, కోనసీమ, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పూర్తి చేశారు. ఆయా జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. అలాగే ఆత్మహత్యలు పాల్పడ్డ కౌలు రైతుల పిల్లలకు చదువులను కూడా జనసేన పార్టీనే చూసుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇందుకు నిధిని కూడా ఏర్పాటు చేశారు.
ఇక ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లానే పవన్ టార్గెట్ చేస్తుండటంతో వైఎస్సార్సీపీ నేతలు ఎలా స్పందిస్తారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పులివెందులలో పర్యటనకు వెళ్లిన చిరంజీవి వాహనాలను వైఎస్సార్ అనుచరులు, బంధువులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన హీట్ పెంచుతోంది.
సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక్క పులివెందులలోనే 12 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని జనసేన పార్టీ నేతలు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 80 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు.కౌలు రైతులకు కూడా నష్టపరిహారం ఇస్తామన్న జగన్ ఏ ఒక్క కౌలు రైతుకూ నష్టపరిహారం ఇవ్వలేదని.. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులకు వైఎస్సార్ బీమా కింద రూ.7 లక్షల బీమా కూడా చెల్లించడం లేదని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
పైగా పవన్ కల్యాణ్ సభలకు వెళ్లకుండా కౌలు రైతుల కుటుంబాలను వైఎస్సార్సీపీ నేతలు, అధికారులు వేధిస్తున్నారని జనసేన పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు పవన్ పర్యటించిన జిల్లాల్లోనూ ప్రభుత్వం ఇలాగే చేసిందని మండిపడుతున్నారు. పవన్ వచ్చే ఒక రోజు ముందు కౌలు రైతు కుటుంబాల్లో నగదు జమ చేయడం చేస్తున్నారని చెబుతున్నారు.
కాగా సిద్ధవటంలో జరిగే బహిరంగ సభలో కౌలు రైతుల కుటుంబాలను, పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.