తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల పయనంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పార్టీలోకి ఏపీ వాసులను కలుపుకొని పోతున్న తీరు.. తెలంగాణ రాష్ట్రం వద్దంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన ఉండవల్లి లాంటి వారిని ఆహ్వానించి చర్చలు జరిపిన వైనం వైరల్ అయ్యింది. ఇప్పుడు ఎక్కడ చూసినా గులాబీ శ్రేణులు 'దేశ్ కీ నేత' అంటూ హోరెత్తిస్తున్నారు. మోడీని ఓడిస్తాడని.. బీజేపీని గద్దెదించే సత్తా కేవలం కేసీఆర్ కే ఉందని నమ్ముతున్నారు.
ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎటూ కాకుండా పోతారని విమర్శించారు. బీజేపీని బలోపేతం చేసే పనిలో కేసీఆర్ బిజీగా ఉన్నారని ఆరోపించారు.
భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పేరుతో దేశంలో పార్టీని ప్రారంభించి తెలంగాణ రాజకీయాన్ని బీజేపీ చేతిలో పెట్టాలని కేసీఆర్ అనుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ కు ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని.. వాటిని అనుసరిస్తే ఆయన దెబ్బైపోతారని అన్నారు.
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 200 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న టీఆర్ఎస్ కల కలగానే మిగిలిపోతుందని అన్నారు.
8 లోక్ సభ స్థానాల్లో ఉన్న టీఆర్ఎస్.. 53 ఎంపీ స్థానాలు ఉన్న కాంగ్రెస్ పరిస్థితి అయిపోతుందని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న 8 ఎంపీ సీట్లు కూడా దక్కవని హితవు పలికారు. కాంగ్రెస్ లేకుండా ముందుకు పోవాలనుకునే వారికి ఎదురుదెబ్బ తప్పదన్న జగ్గారెడ్డి.. అసలు కాంగ్రెస్ లేకుండా దేశంలో ప్రత్యామ్మాయం సాధ్యం కానే కాదని స్పష్టం చేశారు.
శరద్ పవార్, దేవెగౌడ కంటే కేసీఆర్ ఏమైనా గొప్ప లీడరా? అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల్లో తాడు బొంగరం లేని టీఆర్ఎస్ గురించి గొప్పలు చెప్పుకుంటూ కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.