తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఎప్పుడేం జరిగిందో అందరికి తెలిసిందే. తెల్లనివన్నీ పాలు.. నల్లనివన్నీ నీళ్లు కావన్న చందంగా పైకి కనిపించే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వెనుక పెద్ద కసరత్తే జరిగింది. ఇప్పుడు కనిపిస్తున్న తీరులో విభజన జరగటానికి ఎన్నో అంశాలు కారణం. దీనికి బాధ్యులు చాలామందే ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో పైకి కనిపించేది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనే అయినా.. ఆమె వెనుకనున్న పరివారం ఈ వ్యవహారం విషయంలో ఎంతగానో శ్రమించింది.
విభజన వెనుకున్న అసలు నిజాల్ని.. విభజన సందర్భంగా తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి అసలేం జరిగిందన్న విషయాల్ని తాజాగా వెల్లడించారు మాజీ కేంద్రమంత్రి జైరాం రమేశ్. విభజనలోనూ.. రాష్ట్ర విభజన చట్టం రూపకల్పన విషయంలో కీలకభూమిక పోషించిన ఆయన విభజనకు సంబంధించిన అసలు విషయాల్ని.. ‘‘ఓల్డ్ హిస్టరీ – న్యూ బయోగ్రఫీ’’ పేరిట ఒక పుస్తకం రూపంలో రాసేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ పుస్తకం ముందు మాటే 42 పేజీలు ఉంది.
తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన చరిత్రతో పాటు.. 2009 నవంబరు 9న కేసీఆర్ నిరశన దీక్ష మొదలు.. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్ కు వెళ్లటం.. ఈ సందర్భంగా విభజనకు అనుకూలంగా యూపీఏ సర్కారు తీసుకున్న నిర్ణయంతో పాటు.. విభజన ప్రక్రియ ఎలా జరిగిందన్న విశేషాల్ని జైరాం తన పుస్తకంలో వివరంగా వెల్లడించారు. ఆ పుస్తకంలోని కొన్ని అంశాల్ని చూస్తే..
తెలంగాణ ప్రకటనపై వెనకడుగు ఎందుకు?
= కేసీఆర్ నిరశన దీక్షతో తెలంగాణకు అనుకూల ప్రకటన చేయటం.. ఆ పై సీమాంధ్ర నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దీంతో.. తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందంటూ చిదంబరం చేసిన ప్రకటనపై వెనక్కి వెళ్లేలా చేసింది. సీమాంధ్ర ఎంపీలు.. ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. విదర్భ.. గూర్ఖాలాండ్.. డోడోలాండ్.. మారు ప్రదేశ్ డిమాండ్లు ఊపందుకున్నాయి. తమిళనాడు నేత రాందాస్ తమ రాష్ట్రాన్నీ విభజించాలన్నారు. యూపీని నాలుగు ముక్కలు చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానికి రెండు లేఖలు రాశారు. డిసెంబరు 9 ప్రకటన తనను దిగ్ర్భాంతి పరిచిందని నాటి ఏపీ ముఖ్యమంత్రి రోశయ్య వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో విభజన విషయంలో మరిన్ని సంప్రదింపులు అవసరమని భావించాం.
రాష్ట్ర విభజనకు ఎందుకు ఓకే చేశారు?
శ్రీకృష్ణ కమిటీ నివేదిక తదితర పరిణామాలు ఎలా ఉన్నా.. 2011-12 మధ్య అనేకమంది తెలంగాణవాదులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక సంస్థలు.. ముఖ్యంగా జేఏసీ అనేక రూపాల్లో ఉద్యమాల్ని లేవనెత్తింది. 2011 మార్చి 10న ట్యాంక్ బండ్ పైన తెలుగుకు కీర్తి చిహ్నాలైన శ్రీకృష్ణ దేవరాయులు.. అన్నమాచార్య.. సర్ అర్థర్ కాటన్ లాంటి విగ్రహాల్ని ధ్వంసం చేశారు. జులైలో మంత్రి వర్గం నుంచి తెలంగాణ నేతలంతా రాజీనామా చేశారు. ఇవన్నీ కాంగ్రెస్ అధినాయకత్వం మీద ఒత్తిడిని పెంచాయి. దీనికి తోడుగా విభజనకు అనుకూలంగా టీడీపీ.. బీజేపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు లేఖలు ఇచ్చాయి. దీంతో విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవటానికి అవసరమైన బలం వచ్చింది.
విభజన మీద షిండే అలా చెప్పారు
విభజన అంశంపై మంత్రివర్గ ఉప సంఘాన్ని వేయాలన్న నా సూచనకు సమ్మతి లభించింది. అన్నింటికంటే ఆశ్చర్యం కలిగించిన అంశం ఏమిటంటే.. తెలంగాణ ఏర్పాటుకు హోంశాఖ నుంచి చట్టాల రూపకల్పన కోరుతూ సూచన రావటం. ఉప సంఘం వేయగానే.. విద్య.. నదీజలాలపై స్పష్టత ఇవ్వాలని.. లేకపోతే సమస్యలు తప్పవని నిక్కచ్చిగా చెప్పా. ఈ సమయంలోనే విభజన మీద ప్రజల మనోగతం తెలుసుకునేందుకు నాటి హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఒక వెబ్ సైట్ ప్రారంభించాలన్న సూచన చేశారు. దానికి అందరూ సానుకూలంగా స్పందించారు.
తెలంగాణ ఏర్పాటుపై సానుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత.. రాయల్ తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనికి సహేతుక కారణాలు లేకపోలేదు. మజ్లిస్ నేత అసదుద్దీన్ ఓవైసీ సైతం రాయల్ తెలంగాణకు ఓకే చెప్పటం.. రాయల తెలంగాణకు అనుకూలంగా అనంతపురం.. కర్నూలు జిల్లాలకు చెందిన నేతలు నన్ను సంప్రదించేవారు. చివరకు తెలంగాణలో విలీనానికి అనుకూలంగా 1600 పంచాయితీల తీర్మానాన్ని తీసుకొచ్చారు కూడా. రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తే.. రాయలసీమకు రెండు జిల్లాలకు చెందిన 28 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఇస్తారని కూడా నేతలు చెప్పారు. అంతేకాదు.. ఈ రెండు జిల్లాలను తెలంగాణలో చేరిస్తే.. ఏపీ .. తెలంగాణలో సమానంగా ఉండేవని వాదించారు. నిజానికి రాయల్ తెలంగాణకు అనుకూలంగా 12 జిల్లాలతో తెలంగాణ ఏర్పాటుకు అనుగుణంగా బిల్లు రూపకల్పన జరిగింది. కానీ.. కాంగ్రెస్.. మంత్రివర్గ ఉప సంఘం మాత్రం పది జిల్లాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే మొగ్గు చూపాయి.
కిరణ్ వైఖరి ఆశ్చర్యకరం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయాన్ని నాటి ఏపీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది నాకు ఆశ్చర్యం కలిగించింది. సొంత పార్టీ ముఖ్యమంత్రి ఇంత బాహాటంగా ఎలా తప్పు పడుతున్నారన్న సందేహం వ్యక్తం చేశా. 2004 నుంచి కిరణ్ నాకు తెలుసు.. అయితే.. సీఎంగా ఆయన హావభావాలలో వచ్చిన మార్పును గుర్తించా. రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా.. ఆమోదం లేకుండా అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజనకు అస్కారం లేదంటూ కిరణ్ పెద్ద ఎత్తున వాదించారు.
ఏపీ రాజధానిని అందుకే ప్రకటించలేదు
విభజన నేపథ్యంలో ఏపీ రాష్ట్రానికి రాజధాని ఏర్పాటుకు సంబంధించి మౌనంగా ఉండటానికి కారణం ఉంది. విభజన సమయంలోనే కొత్త రాష్ట్ర రాజధానిని ప్రకటిస్తే అలజడి మొదలవుతుందన్న ఉద్దేశంతో మౌనంగా ఉన్నాం. రాజధాని ఎంపికకు శివరామకృష్ణన్ కమిటీ వేయగా.. కర్నూలు.. విశాఖపట్నం.. తిరుపతి.. విజయవాడ పేర్లను సూచించారు. అయితే.. ఏపీ రాజధాని మరో హైదరాబాద్ కాకూడదని భావించాం. కర్నూలు ఏపీకి రాజధానిగా ఉన్నప్పుడు హైకోర్టు గుంటూరులో ఉంది. అదే విధంగా ఏపీలో అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదని చెప్పా.
గొడవ జరగకూడదని షరతు పెట్టారు
రాష్ట్ర విభజన బిల్లు లోక్ సభకు చేరుకున్న వేళ.. ఈ బిల్లు ఆమోదం కోసం ప్రధాని మన్మోహన్ సింగ్ బీజేపీ నేతలతో మీటింగ్ పెట్టారు. ఈ సమావేశానికి హాజరైన బీజేపీ నేతలు.. బిల్లుకు తాము మద్దతు ఇస్తాం కానీ సభలో ఎలాంటి గొడవ జరగకూడదన్న షరతు పెట్టారు. తర్వాతి రోజు లోక్ సభలో బిల్లు పెట్టగానే రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లారు. టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సెక్రటరీ టేబుల్ పై అద్దాన్ని పగలగొట్టారు. మైకు విరగ్గొట్టారు. పెప్పర్ స్ప్రే కారణంగా చాలామంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనతో నేను షాక్ తిన్నా.
విభజన బిల్లు ప్రవేశ పెట్టినట్లేనని హోం మంత్రి.. అసలు అజెండాలోనే లేదని సుష్మాస్వరాజ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 17న అద్వానీ దగ్గరకు నేను.. చిదంబరం వెళ్లాం. అక్కడ సుష్మా.. వెంకయ్యలు ఉన్నారు. విభజన బిల్లును ఫిబ్రవరి 18న ప్రవేశ పెడతామని చెప్పాం. సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడాలని.. బిల్లు సాఫీగా ఆమోదం పొందేలా చూడాలని వెంకయ్య కోరారు.
జాగో.. బాగో మాటలే సెక్షన్ 8కు కారణం
విభజన చట్టంలో సెక్షన్ 8కి కారణం.. తెలంగాణ జాగో.. ఆంధ్రావాలా బాగో..తరహా నినాదాలే. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులను గుర్తించినట్లుగా తెలంగాణ జేఏసీ ప్రకటించటం లాంటివి మా దృష్టికి వచ్చాయి. ఈ సెక్షన్ మీద షిండే.. చిదంబరంతో పాటు కేసీఆర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా.. హైదరాబాద్ లో నివసించే కోస్తా నుంచి వచ్చిన వారి విశ్వాసం కోసం.. భరోసా ఇచ్చేందుకే ఆ సెక్షన్ పెట్టాం.
అందుకే హైదరాబాద్ కేంద్రపాలితం కాలేదు
హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలకు.. సంస్కృతులకు చెందిన వారున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్న ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. కేంద్రపాలిత ప్రాంతాల మీద కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 2013 జులైలో ఒక నిర్ణయాన్ని తీసుకుంది. కొత్తగా కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయకూడదని నిర్ణయించారు. ఈ కారణంతోనే.. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తిరస్కారానికి గురైంది.
తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ రోల్ ఏమిటంటే..
2004లో యూపీఏ సర్కారు ఏర్పడింది. మే 16న సోనియా నివాసంలో యూపీఏ పక్ష నేతలంతా కలిశాం. కనీస ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా త్వరలోనే తెలంగాణ ఏర్పాటు విస్పష్టంగా ఉండాలని కేసీఆర్ పట్టుబట్టారు. కానీ.. కాంగ్రెస్ తో పాటు సీపీఎం పక్షాలు కుదరదన్నాయి. నాకూ ఇబ్బందిగానే అనిపించింది. ఏం చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. ప్రొఫెసర్ జయశంకర్ తో భేటీ ఏర్పాటు చేయించారు. ప్రణబ్ తో కలిసి కేసీఆర్ తో చర్చించి.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ప్రభుత్వం తగు సయంలో తగిన సంప్రదింపులు.. విస్తృత ఏకాభిప్రాయం మేరకు పరిశీలిస్తుందని తేల్చాం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయమైన నేపథ్యంలో 2014 ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ ఆశించింది. సీమాంధ్రలో కాంగ్రెస్ కు విజయవకాశాలు లేవు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడుతోంది. కనీసం తెలంగాణలో అయినా బలాన్ని కాపాడుకోవాలని అనుకున్నాం. డిసెంబరు 9 ప్రకటన ఒక మలుపు అయితే.. విభజనతో ఎన్నికల్లో లబ్థి తథ్యమని అధిష్ఠానాన్ని అజాద్ ఒప్పించటం మరో కీలక మలుపు.