తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు థర్డ్ ఫ్రంట్ పేరుతో కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై వివిధ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. అయితే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కేసీఆర్‌కు అనుకూలంగా మాట్లాడతారనే పేరున్న సీఎల్పీ నేత జానారెడ్డి తాజాగా ఆయనకు నచ్చని వ్యాఖ్యలు చేశారు. దేశానికి యూపీఏ - ఎన్డీఏ కూటములు తప్ప థర్డ్ ఫ్రంట్ అవసరం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం కేవలం ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకేనని జానారెడ్డి ఆరోపించారు.
రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీకి బలం లేకపోయినప్పటికీ వ్యూహాత్మకంగానే బరిలోకి దిగుతున్నట్లు జానారెడ్డి పేర్కొన్నారు. తమ పార్టీ నుంచి గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారని - పార్టీ ఫిరాయింపు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తున్నదని గుర్తుచేశారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తామని తెలిపారు. ఒక పార్టీ నుంచి గెలిచాక ఆ పార్టీ విప్ జారీ చేస్తే చెప్పినట్టుగానే ఓటు వేయాలని, అది కూడా ఎన్నికల అధికారికి ఓటు చూపించి వేయాలని నిబంధన ఉందన్నారు. అందుకే తమ పార్టీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తున్నామని వివరించారు. ఒకవేళ ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ కు ఓటేస్తే దాని ఆధారంగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సులభంగా ఉంటుందని, ఫిరాయింపు ఎమ్మెల్యేల నిజ స్వరూపం బయటపడి అనర్హత వేటు పడుతుందన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ తీరును నిలదీస్తామని జానారెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటూ ఆయన జాతీయరాజకీయాల్లోకి వెళతానని ప్రకటించడం ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో బీజేపీ బలం తగ్గుతోందని కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్నారని ఆయన వివరించారు.