కాంగ్రెస్ సీనియర్ నేత - తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత అయిన జానారెడ్డి చాలాకాలంగా టీఆరెస్ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గోడమీద పిల్లిలా మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ కు పనికొచ్చేలా వ్యవహరించకుండా టీఆరెస్ కు మేలు చేసేలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలే విమర్శించిన సందర్భాలున్నాయి. అంతెందుకు మొన్న గ్రేటర్ ఎన్నికల్లో ఆయన హైదరాబాద్ నగరంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో పెడుతున్న రూ.5 భోజనాన్ని పనిగట్టకుని తిని శభాష్ సూపర్ గా ఉందని కితాబిచ్చి టీఆరెస్ కు మేలు చేశారు. అసెంబ్లీలో కూడా ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేలనే వారించి టీఆరెస్ వారితో పోరాడేవారు కాదన్న విమర్శలున్నాయి. ''పెద్ద మనిషి జానారెడ్డిగారు చెప్పాలి'' అని కేసీఆర్ అనగానే జానా ఒళ్లంతా పులకరించి తమ వారి నోరు మూయించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి జానా ఇప్పుడేమైందో కానీ ఒక్కసారిగా ప్రభుత్వంపై గట్టి విమర్శలే చేశారు. అధికారం ఉంది కదా అని ఇష్టానుసారం వ్యవహరిస్తే భంగపాటు తప్పదంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
ముఖ్యంగా టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆరెస్ లో కలపడంపైనా ఆయన మాట్లాడుతూ ఆ విషయంలో స్పీకర్ దురుద్దేశపూరితంగా వ్యవహరించారని కుండ బద్ధలు కొట్టేశారు. స్పీకర్ దగ్గరున్న పిటిషన్లపై చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యేలను విలీనం చేయడం దురుద్దేశమేనని ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ ఎస్ లో విలీనంపై చేయడం ఆశ్చర్యం కలిగిందని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై న్యాయ నిపుణులను సంప్రదిస్తామని పేర్కొన్నారు. టీడీపీ పరిస్థితే కాంగ్రెస్‌కు వస్తుందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శీతాకాల సమావేశాలు జరపాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదని, అధికారంతో అణగదొక్కాలని చూస్తే భవిష్యత్ లో భంగపడుతారని అన్నారు. చూస్తుంటే అధిష్ఠానానికి జానా వ్యవహారమంతా తెలిసి చీవాట్లు పడినట్లుంది... లేదంటే ఆయన ఇటీవల కాలంలో టీఆరెస్ ను తప్పుపట్టడం ఈ రేంజిలో హెచ్చరించడం లేదు.