తమ నాయకుడు జానారెడ్డి... ప్రస్తుతం పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కారు మీద ఎంత సానుభూతితో, సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ.. ఆయన మంత్రివర్గ సహచరులు - ఆయన కుమారుడు కేటీఆర్.. తమ నేతపై సెటైర్లు వేస్తూ ఉండడం.. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ జానారెడ్డి అనుచరులకు మనస్తాపం కలిగిస్తున్నదట. కాంగ్రెస్ పార్టీ భావజాలంతో నిమిత్తం లేకుండా.. జానారెడ్డి అనుచరులు, ఆయన కోటరీగా ముద్ర ఉన్న వాళ్లు తమ నాయకుడి మనసును గుర్తింంచి, తదనుగుణంగా.. కేసీఆర్ సర్కారు పట్ల కాస్త పాజిటివ్‌గానే ఉన్నారుట. అయితే.. కేటీఆర్ మాత్రం అలాంటి కృతజ్ఞత కూడా లేకుండా.. జానారెడ్డి అంతటి సీనియర్ నేత మీదే వెటకారాలు చేయడం వారికి మనస్తాపం కలిగిస్తున్నదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఒకటి రెండు సంఘటనల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభాపక్ష నాయకుడు జానారెడ్డి - రాష్ట్ర ప్రభుత్వం పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బాగా జరుగుతూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే శాసనసభ జరుగుతూ ఉన్నప్పుడు కూడా.. జానారెడ్డి సభలో ఉంటే కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ ప్రభుత్వం మీద పల్లెత్తు మాట అనకుండా.. మెతగ్గా వ్యవహరించేలా 'లీడ్'చేస్తూ ఉంటారని.. కీలక అంశాలమీద తానే మాట్లాడుతూ తేల్చేస్తూ ఉంటారని, ఆయన సభలో లేకపోతే గనుక.. కాంగ్రెస్ సభ్యులు సర్కారును ఒక ఆట ఆడుకుంటారని ప్రచారం ఉంది. అదే తరహాలో.. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోరాడాల్సిన అంశాలను జాబితా కట్టినప్పుడు ప్రాజెక్టుల రీడిజైన్ గురించి జానారెడ్డి - కేసీఆర్ ను సమర్థించారు. అది చాలా మంచి చర్య అన్నారు. దానికి వ్యతిరేకంగా జరిగే పోరాటంలోనూ ఆయన పాల్గొనలేదు. ప్రభుత్వానికి తమ నేత ఇంత సానుకూలంగా ఉంటే.. కేటీఆర్ సెటైర్లు వేయడం బాధాకరం అని జానావర్గం బాధపడుతున్నారుట.
కేటీఆర్ మెదక్ జిల్లాలోని ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యల గురించి ప్రతిపక్షాలు ఎవ్వరూ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం లేదంటూ విరుచుకు పడ్డారుట. రైతుల సంక్షేమానికి ఆత్మహత్యల్ని అరికట్టడానికి అన్ని రకాలుగానూ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని.. అయితే.. ప్రతిపక్షాలు ఆడిపోసుకోవడం తప్ప మంచి సూచనలు చేయడం లేదని అన్నారుట. అంతవరకు ఓకే ఏదో రైమింగ్ బాగుంటుందని అనుకున్నారేమో గానీ.. కాంగ్రెస్ నేత జానారెడ్డి జానెడంత మంచి కూడా చెప్పలేదని వెటకారం చేశారుట. తమ నాయకుడి మెతకదనమే.. కేటీఆర్ లాంటి వాళ్లు ఇలా మాట్లాడ్డానికి కారణం అవుతున్నదంటూ జానా వర్గం బాధపడుతున్నారుట.