గడిచిన కొద్దిరోజులుగా సర్వేల ముచ్చట తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కించింది. వేసవి వేడితో పోటీ పడుతూ.. తెలంగాణ అధికార.. విపక్షాల మధ్య ఓ స్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది. తాను చేయించిన సర్వేలో తమకు 111 స్థానాలు రానున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం.. దానిపై విపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే.
ఎప్పుడూ లేని విధంగా.. తాజా సర్వే ఎపిసోడ్ లో కేసీఆర్ పదే పదే విపక్షాలపై విరుచుకుపడుతూ.. సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి తనదైన శైలిలో కేసీఆర్ వాదనకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తమ పార్టీకి ప్రజల్లో విశ్వాసం ఉందని.. 2019లో తాము అధికారంలోకి రావటం ఖాయంగా చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ గెలుస్తుందని సర్వేలన్నీ చెప్పాయని.. కానీ గెలిచింది మాత్రం ట్రంప్ అని చెప్పుకొచ్చారు. తనకు సర్వేల మీద నమ్మకం లేదన్న ఆయన.. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టకుండా సర్వేలతో ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.
సర్వేల మీద నమ్మకం లేదని చెబుతున్న జానా.. కేసీఆర్ సర్వేల మాటను సమర్థవంతంగా కౌంటర్ ఇచ్చినప్పటికీ.. ఆయన వాదనకు కేసీఆర్ ఇచ్చే కౌంటర్ ఏ విధంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. మరో కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఆసక్తికర సవాలు విసిరారు.
వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ..ఒకవేళ అలా కానీ కేసీఆర్ చేస్తే.. తాను ఎన్నికల బరిలో నిలవనని చెప్పారు. సిట్టింగ్ లకు టికెట్లు ఇవ్వటమే కాదు.. ఎన్నికల ఖర్చును పార్టీనే భరిస్తుందని చెప్పిన వేళ.. పొన్నం విసిరిన సవాల్ కు అధికార టీఆర్ ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/