రాయలసీమలో బలిజలు గతంలో చిరంజీవిని ఓన్ చేసుకున్నారు. చిరంజీవి స్థాయిలో కాకపోయినా రాజకీయంగా పవన్ కల్యాణ్ ను కూడా బలిజలు గట్టిగానే ఓన్ చేసుకున్నారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు బలిజలు చాలా ఉత్తేజంగా ఫీలయ్యారు. ఉత్సాహంతో ఓటేశారు. అయితే చిరంజీవి తన పార్టీని విలీనం చేసి వెళ్లిపోవడంతో వారు నిరుత్సాహపడ్డారు. ఇక పవన్ కల్యాణ్ రాజకీయ పార్టీతో వచ్చినప్పుడూ వారు ఉత్సాహ పడ్డారు కానీ.. ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తరుణంలో వాళ్లు పవర్ స్టార్ ను మరీ అంత గట్టిగా సమర్థించడం లేదు.
కేవలం యువతరం తప్ప.. బలిజల్లోని వేరే వాళ్లు పవన్ కల్యాణ్ కు రాజకీయంగా మద్దతుగా నిలవడం లేదు. అయితే యువతరంతో పాటు కొద్ది పాటి స్థాయిలో ఇతర వయసుల వాళ్ల ఓట్లు కూడా పడతాయి. ఇక సినీ అభిమానంతో ఓటేసే జనం కూడా ఈ సారి పవన్ కల్యాణ్ వైపు కొంతలో కొంత మొగ్గు చూపారనే అంచనాలున్నాయి.
అయితే… ఇవేవీ జనసేన అభ్యర్థులు విజయం సాధించడానికి ఉపయోగపడే ఓట్లు కావు. దాదాపు రెండు లక్షల ఓట్లుండే నియోజకవర్గాల్లో ఏ ఐదారు శాతం మందో జనసేన వైపు మొగ్గు చూపి ఉండవచ్చుని పరిశీకులు అంటున్నారు. మరి ఇంతకీ ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ జనసేన ఎవరిని దెబ్బ తీసింది అనేదే అసలైన ప్రశ్న.
ఈ విషయంలో ఒకే అభిప్రాయం వినిపిస్తూ ఉంది. రాయలసీమ వరకూ జనసేన తెలుగుదేశం పార్టీని బాగానే దెబ్బ కొట్టి ఉంటుందని. గతంలో చిరంజీవి పార్టీని పెట్టినప్పుడు చాలా మంది తెలుగుదేశం వాళ్ల మెజారిటీలు కరిగిపోయాయి. కొందరు ఓడిపోగా - మరి కొందరు స్వల్ప మెజారిటీలతో బయటపడ్డారు. అప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలా మంది ఓటర్లు దూరం అయ్యారు. అలాంటి వారు ఆ తర్వాత జగన్ వైపు కూడా మళ్లారు. మెజారిటీ ఓటర్లు తిరిగి తెలుగుదేశం వైపు వెళ్లిపోయారు.
వారిలోనే ఇప్పుడు కొంత శాతం మంది మళ్లీ పవన్ కల్యాణ్ వైపు మళ్లి ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే జనసేన సీమలో గట్టి పోటీదారు ఏమీ కాదు. పవన్ కల్యాణ్ ప్రచారం చేసిందే ఎనిమిది నియోజకవర్గాల్లో అని అంటున్నారు. యాభైరెండు సీట్లున్న సీమలో కేవలం ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే పవన్ ప్రచారం చేశారు. ఫలితంగా జనసేన గ్రాఫ్ పైకి లేవలేదు.
అయితే.. అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. ఫలితంగా గాజు గ్లాసు గుర్తుకు వెయ్యి నుంచి ఐదారు వేల ఓట్లు అయితే ఖాయంగా పడి ఉంటాయని అంచనా. బలమైన అభ్యర్థులు బరిలోకి దిగారన్న తిరుపతి - నంద్యాల - ధర్మవరం నియోజకవర్గాల్లో ఈ ఓట్ల స్థాయి మరి కాస్త ఎక్కువ కూడా ఉండవచ్చని అంటున్నారు.
జనసేనకు ఓటేసిన వారి నేపథ్యాన్ని బట్టి చూస్తే వారిలో మెజారిటీ ఓటర్లు తెలుగుదేశం సైడ్ వాళ్లే అని, పవన్ కు పడిన వంద ఓట్లలో డెబ్బై ఐదు శాతం వరకూ తెలుగుదేశం ఓట్లే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు! అసలే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు… పవన్ తెలుగుదేశం పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకును చీల్చడం ఆ పార్టీని దెబ్బ తీసే అంశమే అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు కథ ఏమిటనేది ఫలితాలు వస్తే కానీ తెలియదు!