ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ పై షాకింగ్ ఆరోపణలు చేసింది జనసేన. అదే పనిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నోరు పారేసుకునే మంత్రి గుడివాడ అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయన్న విషయాన్ని తాజా ఆరోపణలు స్పష్టం చేస్తాయని చెబుతున్నారు.
ఇప్పటికే విశాఖపట్నంలో వైసీపీ నేతల భూదందాలు ఆరాచక స్థాయికి చేరుకున్నాయన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. తాజాగా మంత్రి గుడివాడ మీద మొదలైన కొత్త ఆరోపణలతో మరిన్ని ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇంతకూ జనసేన తాజాగా చేస్తున్న ఆరోపణలు ఏమిటి? దాని ఎఫెక్టు ఏమిటన్న విషయంలోకి వెళితే..
ఇంతకాలం విశాఖను లక్ష్యంగా చేసుకొని దందా చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల మీద పడ్డారని.. అందుకు కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విస్సన్నపేటలోని 609 ఎకరాల్ని రైతుల నుంచి బలవంతంగా కొన్నట్లు ఆరోపిస్తున్నారు. ఇదంతా మంత్రి గుడివాడ కన్నుసన్నల్లో జరిగినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. మంత్రి మనుషులు అడిగిన భూముల్ని అమ్మటానికి రైతులు ముందుకు రాకపోతే.. వారి భూముల్ని బ్లాక్ లిస్టులో పెట్టేసి.. వారికి వారుగా తెగనమ్ముకునే పరిస్థితిని తీసుకొస్తున్నట్లుగా జనసేన ఆరోపిస్తోంది.
ఇప్పటికే ప్రభుత్వ భూముల్ని వైసీపీ నేతలు ఆక్రమించారని.. గెడ్డలు కప్పేశారని..కొండల్ని పిండి చేశారని.. ఇప్పుడు మంత్రి వ్యవహారం మరో లెవల్ కు వెళ్లినట్లుగా చెబుతున్నారు. మంత్రి గుడివాడకు సంబంధించి రియల్ వెంచ్ లో భాగంగా ఈ దందా నడిచినట్లుగా చెబుతున్నారు. దీనిపై ఏసీబీ డీజీ స్థాయి అధికారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదంటున్నారు.
ఈ భూమి వ్యవహారంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ తో పాటు.. గవర కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ బొడ్డ ప్రసాద్ తో పాటు మరో మంత్రి మేనల్లుడి పాత్ర ఉన్నట్లుగా చెబుతున్నారు. మంత్రి గుడివాడకు చెందినదిగా చెబుతున్న రియల్ వెంచర్ లో ఎలాంటి అనుమతులు లేకుండానే బ్రోచర్లను మార్కెట్లోకి తెచ్చేసినట్లుగా చెబుతున్నారు.
మంత్రిఅమర్నాధ్ పాత్ర ఉందని చెబుతున్న ఈ భూఆక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని జనసేన డిమాండ్ చేస్తుంది. మరి.. దీనికి మంత్రివారు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.