పోలింగ్ హీట్: జనసేన ఆందోళన వాటి మీదే!

Update: 2019-04-09 11:30 GMT
-ఎక్కడో మొదలుపెట్టి మరెక్కడికో వచ్చినట్టుగా ఉంది జనసేన పార్టీ పరిస్థితి. పవన్ కల్యాణ్ సీఎం అవుతాడు అని ఆ పార్టీ వీరాభిమానులు ఆశించారు.

-పోలింగ్ సమయంలో వస్తున్న సర్వేలు..  పవన్ పార్టీకి ఒకటి నుంచి మూడు ఎమ్మెల్యే సీట్లు దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.

-దీంతో జనసైనికుల్లో కలవరం మొదలైంది. పవన్ పార్టీకి ఆరు శాతానికి తగ్గకుండా ఓట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నాయి. అయితే కనీసం ఆరు సీట్లు నెగ్గే అవకాశం లేవని వివిధ సర్వేలు చెబుతున్నాయి. దీంతో పవన్ ముఖ్యమంత్రి ఆశలు మరింతగా అడుగంటాయి.

-కర్ణాటక తరహాలో హంగ్ పరిస్థితి ని జనసైనికులు ఆశించారు. అయితే అది కూడా జరిగే పని కాదని స్పష్టం అవుతోంది సర్వేలను బట్టి.

-పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీని పల్లెత్తు మాట అనకపోవడం, పదే పదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకోవడం ఆ పార్టీకి పెద్దమైనస్ పాయింట్ గా మారింది.

-పవన్ ఒకవేళ ఇరు పార్టీలనూ సమంగా టార్గెట్ చేసుకుని ఉంటే, సీరియస్ ప్లేయర్ గా రాజకీయం చేసి ఉంటే, మరింతగా కసరత్తు చేసి ఉంటే.. జనసేన స్థితిగతులు మరికొంత మెరుగ్గా ఉండేవి.

-అయితే పవన్ ప్రసంగాలు అభిమానులకు తప్ప బయటి వాళ్లను ఆకట్టుకోలేకపోవడం, పవన్ వీరాభిమానుల్లో చాలా మంది కి ఓటు హక్కుకు తగిన వయసు కూడా లేకపోవడం ఇప్పుడు బయటపడుతూ ఉంది.

-పోల్ మేనేజ్ మెంట్ అంటే ఏమిటో కూడా జనసైనికులకు అర్థం కాని వైనం స్పష్టం అవుతోంది. బైకుల మీద పవన్ స్టిక్కర్లు అతికించుకున్న వాళ్లు కూడా.. టీ గ్లాస్ గుర్తుకు ఓటేసినా గెలవరనే భావనలోకి రావడం విశేషం.

-పోలింగ్ సమయానికి వచ్చేసరికి జనసేన గ్రాఫ్ మరింత గా డౌన్ కావడానికి పూర్తి కారణం పవన్ కల్యాణే. తెలుగుదేశం పక్షపాతి అనే ముద్ర ను తనంతకు తనే వేసుకున్నారు పవన్ కల్యాణ్. ప్రజారాజ్యం  పార్టీ ఇమేజ్ కూడా జనసేనకు మరింత వెనుకబడేందుకు కారణం అవుతోంది.

-జనసేనకు ప్రతి నియోజకవర్గంలోనూ ఓట్లు అయితే వస్తాయి. అయితే అవి గెలుపుకు మాత్రం ఉపయోగపడేలా లేవు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

-పవన్ కల్యాణ్ రెండో చోట్లా గెలిచి పరువు నిలుపుకోవాలనేదే ఇప్పుడు జనసేన  అభిమానుల ముందున్న పెద్ద కోరికగా కనిపిస్తోంది! ఇదీ పరిస్థితి!


Tags:    

Similar News