జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీ లో పలు కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సమావేశాల్లోనే ఇంగ్లీషు మీడియం స్కూళ్ల ఏర్పాటులో ప్రభుత్వ నిర్ణయానికి రాపాక మద్దతు ప్రకటించి వార్తల్లో నిలిచారు. తమ పార్టీ అధినేత వైఖరికి భిన్నంగా ఆయన వ్యవహరించారనే ప్రచారం సాగింది. ఆ తరువాత ఎస్సీ..ఎస్టీ సంక్షేమం పైన చర్చ సందర్భంగానూ ముఖ్యమంత్రి జగన్ ను రాపాక ప్రశంసలతో ముంచెత్తారు. ఇక, ఇప్పుడు సభలో రాపాక ఏకంగా టీడీపీ హాయంలో జరిగిన అవినీతిని ప్రస్తావించారు. తెలుగుదేశం ప్రభుత్వం హాయంలోనే ఉపాధి హామీ నిధుల్లో భారీగా అవినీతి జరిగిందని అన్నారు.
2014 రాజోలు నుండి టీడీపీ అభ్యర్ధిగా గెలిచిన సూర్యారావు నియోజకవర్గానికి చేసింది ఏదీ లేదని మండిపడ్డారు. నియోజకవర్గానికి ఏమి చేయకుండా...ఆయన మాత్రం కోట్లాది రూపాయలతో సొంత కాలేజి నిర్మించుకున్నారని ఆరోపించారు. తన నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి బాగోలేదని.. జిల్లాలో చివరి నియోజకవర్గం తనదే అని తెలిపారు. దీనితో ప్రభుత్వం తన నియోజకవర్గం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని అభ్యర్దించారు.
అలాగే, అదే సమయంలో రాపాక తనకు మాట్లాడే అవకాశం లేకుండా టీడీపీ అల్లరి చేస్తుందని ఫైర్ అయ్యారు. ఈ వ్యాఖ్యల పై స్పందించిన స్పీకర్.. ఆసక్తి కర సూచన చేసారు.టీడీపీ సభ్యులు ఇబ్బంది కలిగిస్తున్నారని..అదే విషయం పలుమార్లు వారికి చెప్పానని గుర్తు చేసారు. అసలు..ఈ వ్యవహారం పైన మీరు వారి పైన చర్యలు కోరుతూ ఎందుకు ప్రయివేటు తీర్మానం ప్రవేశ పెట్టకూడదంటూ సూచన చేసారు. దీనికి సరే అన్నట్లుగా రాపాక నమస్కారం చేస్తూ..అంగీకారం తెలిపారు. ఇక నేటితో ఈ శీతాకాల సమావేశాలు ముగియడంతో ..వచ్చే సమావేశాల్లో జనసేన ఎమ్మెల్యే ఏంచేస్తారో చూడాలి.