వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిస్తే వైసీపీ కచ్చితంగా ఓడిపోతుందని అధికార పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని కుర్చీలో నుండి ఎప్పుడెప్పుడు దింపేద్దామా ? ఎప్పుడెప్పుడు జైలుకు పేంపేద్దామా అని ఎదురుచూస్తు, శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న రఘురాజు వచ్చే ఎన్నికల్లో ఫలితాలపై ఏకంగా జోస్యమే చెప్పేశారు. తమపార్టీ ఓటమిపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని కూడా చెప్పారు.
ప్రతిపక్షాలు పాలక పార్టీని ఓడించాలని చూడటం సహజమే కదా అని ప్రశ్నించారు. ఇందులో భాగంగా ప్రజల ఓట్లను చీలనివ్వబోనని గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనను ఎంపీ గుర్తుచేశారు. చంద్రబాబునాయుడు సభలకు సహజంగానే ప్రజలు దండిగా హాజరయ్యారని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని, ప్రజల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమే అని చంద్రబాబు చెప్పటాన్ని ఎంపీ ప్రస్తావించారు.
వీళ్ళద్దరి వ్యాఖ్యలను చూసి తమ పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదని ఎంపీ ఎద్దేవా చేశారు. మన ప్రభుత్వం పరిపాలన బాగుంటే ప్రజలు ఓట్లేస్తారు లేకపోతే లేదని తిరుగుబాటు ఎంపీ సింపుల్ గా తేల్చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఇదే విషయమై వైసీపీ నేతలు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని ఎప్పటినుండో చెబుతున్నారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు కూడా దీన్ని ధృవీకరించారు. పొత్తు కోసం తాను పవన్ కు లవ్ ప్రపోజల్ పంపిన విషయాన్ని చంద్రబాబే అంగీకరించారు.
మరిదే విషయాన్ని పవన్ ఎందుకని బహిరంగంగా మాట్లాడటం లేదు ? టీడీపీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్నది పూర్తిగా పవన్ ఇష్టం. అదే విషయాన్ని పవన్ బహిరంగంగా ఎందుకని చెప్పటం లేదో తిరుగుబాటు ఎంపీ వివరిస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా ఇద్దరి ఆలోచనలు ఒకటే అయినపుడు పొత్తు విషయాన్ని స్పష్టం చేయటంలో పవన్ ఎందుకు వెనాడుతున్నారో ఎంపీ చెప్పగలరా ? ఎన్నికల్లో గెలుపోటములు సంగతి తర్వాత ముందు పొత్తు విషయాన్ని బహిరంగంగా ప్రకటిస్తే అదే చాలు.