ఇప్పటి వరకు ఎవరికివాటిగా ఉన్న పార్టీలు ఒకే వేదికపైకి ఎక్కాయి. ఒకే గళం వినిపించాయి. మరి ఇక మిగిలింది ఏంటి? ఈ పార్టీలకు ఉన్న బలం ఏంటి? ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్ ఎంత? ఇదీ.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లో ఎవరు ఎవరితో అయినా.. పొత్తులు పెట్టుకోవచ్చు. అది తప్పుకాదు. అయితే.. పొత్తులు పెట్టుకోవడంలో.. ఒక నిబద్ధత.. నైతికత అనేది ఉండాలికదా? అంటున్నారు. ఎందుకంటే.. 2014లో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన, బీజేపీలు 2019లో విడిపోయాయి.
ఎవరికివారుగా ఆ ఎన్నికల్లో పోటీ చేశారు. అంతేకాదు.. ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. విమర్శించుకు న్నారు. అయితే.. ఇప్పుడు.. మళ్లీ ఒకేవేదికపై ఎక్కారు. బీజేపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నుంచి పార్టీ అధినేత చంద్రబాబు.. సీపీఐ నాయకులు నారాయణ, రామకృష్ణ వంటివారు.. తిరుపతిలో జరిగిన సభకు వచ్చారు. ఇక, జనసేన తరఫున పార్టీ అధినేత పవన్ వ్యూహాత్మకంగా ఎగ్గొట్టారు. అయితే.. సందేశం మాత్రం పంపించారు. కీలక నేతలు హాజరయ్యారు.
అయితే.. ఇది అమరావతి కోసమే కలిశారని.. ఆయా పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ, వాస్తవానికి అమరావతి కోసమే కాదని.. భవిష్యత్ వ్యూహం కూడా స్పష్టంగా కనిపిస్తోందని.. అంటున్నా రు పరిశీలకులు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కలిసి పోటీ చేసేందుకు వ్యూహాత్మకంగానే కలిశారని.. ఇది ట్రయల్ అని.. దీనికి వచ్చిన రెస్పాన్స్ చూసుకుని.. తర్వాత.. నిర్ణయం తీసుకుంటారని.. చెబుతున్నారు.
అంతేకాదు.. వచ్చే ఎన్నికల నాటికి వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు కూడా ఇది దోహదపడు తుందని అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు.. మూడు పార్టీలూ.. కలసి ఒకే వేదికపంచుకున్నా.. ప్రజల నుంచి పెద్ద గా రెస్పాన్స్ రాలేదని.. అంటున్నారు పరిశీలకులు. అయితే.. ముసుగులు మాత్రం తొలగిపోయాయని.. కాబట్టి.. నెక్ట్స్ వ్యూహం ఏంటనేదే చూడాల్సి ఉంటుందని అంటున్నారు.