ముదిరిపోతున్న మాటల యుద్ధం

Update: 2020-12-31 01:30 GMT
వైసీపీ-జనసేన మధ్య మాటల యుద్ధం ముదిరిపోతోంది. రెండు రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కావాలనే గుడివాడలో మంత్రి కొడాలి నానిని కెలికారు. రోడ్డుషో సందర్భంగా కొడాలిని ఉద్దేశ్యపూర్వకంగానే రెచ్చగొట్టారు. బోడిలింగమని, శతకోటి లింగాల్లో ఓ బోడిలింగమని రెచ్చొగొట్టారు. నిజానికి పవన్ ఆరోపణలు చేయదలచుకుంటే, విమర్శలు చేస్తే నేరుగా ప్రభుత్వంపైనే చేయవచ్చు. కానీ మధ్యలో అవసరం లేకపోయినా కొడాలిని కావాలనే రెచ్చగొట్టారు.

దాంతో మరుసటి రోజు కొడాలి రెచ్చిపోయారు. శివలింగం ఎవరో బోడిలింగం ఎవరో చాలా క్లియర్ గా వివరించి మరీ చెప్పారు. పనిలో పనిగా పవన్ కు గట్టి వార్నింగులే ఇచ్చారు. ఎలాగూ పవన్ని అన్నారు కాబట్టి చంద్రబాబునాయుడును కూడా సీన్ లోకి లాగేశారు. చంద్రబాబు, పవన్ ఇద్దరిని కలిపి కొడాలి గట్టిగానే వ్యాఖ్యలు చేశారు

అయితే కొడాలి మాటలకు, వ్యాఖ్యలకు తాను స్పందించకుండా తన నేతలను పవన్ ఉసిగొల్పారు. కొడాలి మీద రెచ్చిపోయిన పలువురు జనసేన నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడేశారు. దానికి మళ్ళీ కౌంటరుగా కొడాలి మీడియాతో మాట్లాడారు. పవన్ను డోంట్ కేర్ అన్నారు. తంతే వెళ్ళి పక్కదేశంలో పడతావంటూ వార్నింగ్ ఇచచారు.

చంద్రబాబుకు ఎప్పుడు సమస్యలు వచ్చిన వెంటనే ఆదుకునేందుకు పవన్ వచ్చేస్తాడంటు ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ కలిసినా తమనేమీ చేయలేరంటు వార్నింగ్ ఇచ్చేశారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఇవ్వగానే ప్యాకేజీ ప్రకారం దాన్ని చదివేస్తుంటాడు పవన్ అంటు ఎగతాళి చేశారు. అంటే ఈ ఆరోపణలు పవన్ పై కొత్తేమీ కాదులేండి. జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాటంటే తాము పదిమాటలంటామంటూ గట్టిగానే హెచ్చరించారు. ఏదేమైనా మాటల యుద్ధం హద్దులుదాటి వెళ్ళిపోతోందనే చెప్పాలి.
Tags:    

Similar News