అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో తాజాగా చోటు చేసుకున్న రగడ పలువురిని విస్మయానికి గురి చేస్తుంది. అధిష్ఠానం దూతల ఎదుటే పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి తలపటం గమనార్హం. వరంగల్ ఉప ఎన్నికలో అభ్యర్థి ఎంపిక కోసం నిర్వహించిన కార్యక్రమం కొట్టుకునే వరకూ వెళ్లింది. ఉప ఎన్నికల్లో బరిలోకి నిలపాల్సిన అభ్యర్థిపై అభిప్రాయ సేకరణ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం రసాభాసగా మారిపోయింది. అభిప్రాయ సేకరణ కోసం అధిష్ఠానం నుంచి వచ్చిన దూత ఎదుటే కొట్టేసుకున్నారు.
వరంగల్ మాజీ ఎమ్మెల్యే దుగ్యాల శ్రీనివాస్.. డీసీసీబీ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి వర్గీయుల మధ్య నెలకొన్న విభేధాలు తీవ్రస్థాయికి చేరుకోవటమే కాదు.. హద్దులు దాటి రెండు వర్గాల మధ్య జరిగిన తన్నులాటలో ఒకరిద్దరు గాయపడ్డారు కూడా. పవర్ లేక కిందామీదా పడుతున్న కాంగ్రెస్ పార్టీకి తాజా పరిణామాలు తలనొప్పిగా మారినట్లే. అందరూ కలిసి ఐక్యంగా పోరాడాల్సిన స్థానే.. విభేధాలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటం.. అది కూడా అధిష్ఠానం దూత ఎదుట.. రాష్ట్ర నాయకత్వం ఉన్నప్పటికి పట్టించుకోకుండా కొట్టేసుకోవటంపై కాంగ్రెస్ కాంగ్రెస్ నేతలతో పాటు.. కార్యకర్తలు సైతం ఆందోళన చెందుతున్నారు.
ఇలాంటి అనైక్యతల నేపథ్యంలో కలిసికట్టుగా రాజకీయ ప్రత్యర్థిపై కొట్లాట సాధ్యమేనా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పవర్ ఉన్నా.. లేకున్నా విభేధాలతో రగిలిపోవటంలో తమకు తామే సాటి అన్న విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ మరోసారి నిరూపించింది. మరి.. ఈ విభేదాలను పరిష్కరించి.. పార్టీకి ఏకతాటి మీద నడిపించే వారు ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మరోవైపు.. వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులుగా ఆరుగురు పేర్లతో కూడిన జాబితాను తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం అధిష్ఠానానికి పంపినట్లుగా తెలుస్తోంది.
ఈ జాబితాలో మాజీ ఎంపీ వివేక్.. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ.. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహా.. వరంగల్ మాజీ ఎంపీ రాజయ్య.. విజయరామారావు.. రాజారపు ప్రతాప్ లు ఉన్నట్లు చెబుతున్నారు. మరి.. వరంగల్ బరిలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సూచించిన ఆరుగురిలో ఒకరికి టిక్కెట్టు ఇస్తారా? లేక.. జాబితాకు భిన్నంగా అభ్యర్థిని డిసైడ్ చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.