అమ్మ పోరు ఖరారైంది

Update: 2015-05-27 04:52 GMT

పురుచ్చితైలవిగా పేరుపొందిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరోమారు తన విప్లవ నాయకి బిరుదును సార్థకం చేసుకునే దిశగా ముందుకువెళుతున్నారు. అక్రమాస్తుల కేసులో ఎమ్మెల్యే పదవితో పాటు ముఖ్యమంత్రి పీఠం కోల్పోయిన జయ తాజాగా తిరిగి సీఎం పీఠం అధిరోహించిన సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యే కాని జయలలిత ఆరునెలల లోపు ఉప ఎన్నికలకు వెళతారా లేక ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతారా అనే సందేహాలు, చర్చలు సాగాయి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేలా జయ నిర్ణయం తీసుకున్నారు. 

ఆర్‌కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జయ పోటీ చేయనున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు జయలలిత తమకు చెప్పారని వారు ప్రకటించారు. జూన్ 27న ఈ ఉప ఎన్నిక జరగనుంది. వారం క్రితం ఆర్‌కేనగర్ శాసనసభ్యుడు, అన్నాడీఎంకే నేత వెట్రివేల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే అసెంబ్లీ స్పీకర్ ఆ రాజీనామాను ఆమోదించారు. తాజాగా ఎన్నికల ప్రక్రియకు షెడ్యూల్ విడుదల అవడం ఆసక్తికరం.
Tags:    

Similar News