బ‌య‌ట‌కొచ్చారు: పేరుకు మాత్ర‌మే అమ్మా?

Update: 2015-12-03 15:56 GMT
అమ్మంటే.. పిల్ల‌ల‌కు అన్నం పెట్టాక త‌న ఆక‌లి గురించి ఆలోచిస్తుంది. అంతే త‌ప్ప పిల్ల‌ల‌కు ఏమైనా అయితే అస్స‌లు త‌ట్టుకోలేదు. మ‌రి.. త‌మిళ‌నాడు మొత్తం అమ్మ‌గా పిలిపించుకునే ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత అమ్మ ఇప్పుడేం చేస్తున్నారు. చెన్నై స‌హా త‌మిళ‌నాడు తీవ్రంగా న‌ష్ట‌పోతుంటే.. ఆమె జాడ క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఇక‌.. చెన్నై మ‌హాన‌గ‌రంలో దాదాపు 70 ల‌క్ష‌ల‌కు పైనే ప్ర‌జ‌లు న‌ర‌కం అనుభ‌విస్తుంటే.. అమ్మ బ‌య‌ట‌కు వ‌చ్చింది లేదు.. ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని క‌దిలించింది లేదు.

ఏదైనా విప‌త్తు చోటు చేసుకున్న‌ప్పుడు.. ప్ర‌భుత్వ యంత్రాంగం ఒక్క‌సారిగా స్త‌బ్దుగా మారిపోతుంది. వారిలో చైత‌న్యం ర‌గిల్చి.. ప‌రుగులు తీయిస్తూ.. తాను ప‌రుగులు పెడుతూ.. అప‌న్న‌హ‌స్తం కోసం ఆశ‌గా ఎదురుచూసే వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చి.. ఎంతోకొంత సాంత్వ‌న క‌లిగించే ప్ర‌య‌త్నం చేయాల్సి ఉంటుంది.

కానీ.. అలాంటివేమీ జ‌య‌ల‌లిత‌లో ఉన్న‌ట్లు క‌నిపించ‌వు. దాదాపుగా ఐదారు రోజులుగా వ‌ర్షాల‌తో ఆగ‌మాగ‌మైపోయిన చెన్నై న‌గ‌రంలో ఆమె జాడే క‌నిపించ‌ని ప‌రిస్థితి. చివ‌ర‌కు ఢిల్లీలో ఉన్న ప్ర‌ధాని మోడీకి త‌మిళ‌నాడు ప‌రిస్థితి చూసి చ‌లించిపోయి.. ఆయ‌న‌కు ఆయ‌న చెన్నై వ‌చ్చేందుకు సిద్ధ‌మైతే త‌ప్పించి జ‌య‌ల‌లిత ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితి.

ఘోరంగా దెబ్బ తిన్న చెన్నై మ‌హాన‌గ‌రంలోని ప్ర‌జానీకం నానా క‌ష్టాలు ప‌డుతుంటే.. బాధిత ప్ర‌జానీకం ఒక‌రిని ఒక‌రు ఓదార్చుకున్నారే కానీ.. ముఖ్య‌మంత్రి స్థానంలో కూర్చున్న అమ్మ పెద‌వి విప్పింది లేదు.. కాలు బ‌య‌ట పెట్టింది లేదు. ప్ర‌ధాని మోడీ త‌మిళ‌నాడులోని ప‌రిస్థితిని చూసేందుకు వ‌స్తున్నార‌న్న స‌మాచారం అందుకున్నాక కానీ.. జ‌రిగిన న‌ష్టంపై ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించ‌టానికి క‌ద‌ల‌టం చూసిన‌ప్పుడు.. ఇంత‌కాలం పిలుచుకునే అమ్మ అమ్మేనా? అన్న అనుమానం రాక మాన‌దు.
Tags:    

Similar News