అన్నాడీఎంకే అధినేత్రి - దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పొయెస్ గార్డెన్ ను జప్తు చేసేందుకు రంగం సిద్ధమైంది. జయలలితకు సంబంధించి ఆరు జిల్లాలలో ఉన్న ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాల మేరకు పొయెస్ గార్డెన్ జప్తుకు సన్నాహాలు చేస్తున్నారు. జప్తు చేసిన అనంతరం దీనిని జయలలిత స్మారక కేంద్రంగా మార్చే అవకాశం ఉంది. అలాగే జయలలిత ఆస్తులకు సంబంధించి ఆరు జిల్లాలలో జప్తునకు ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.
కాగా ఇటీవల అమ్మ నివాసమైన పొయెస్ గార్డెన్‌పై తమిళ మీడియా సంచలన కథనాలు వెలువరించింది. ఒకనాడు కళకళలాడిన పొయెస్ గార్డెన్ నేడు నిశ్శబ్దంగా మారిందని, దీపాల వెలుగులతో మెరిసిన భవనం చీకటి గుహలా తయారవుతోందని వార్తలు వెలువడ్డాయి. తాళాలు వేసిన తలుపులు, మసక వెలుతురుతో కనిపించే పోర్టికో ఒక భయాన్ని రేకెత్తించేలా ఉందని పేర్కొంది. ఒక్కమాటలో చెప్పాలంటే పొయెస్ గార్డెన్ ప్రస్తుతం దెయ్యాల కొంపలా మారుతోందని స్థానిక మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పొయెస్ గార్డెన్ ను జయలలిత స్మారక మందిరంగా మార్చాలని భావించింది. అయితే పరిపాలనమైన ముందడుగు పడకపోవడం, తగిన కార్యాచరణ జరగకపోవడం, అన్నాడీఎంకే నేతల మధ్య విబేధాల కారణంగా అది ఆచరణ రూపం దాల్చలేదు. మరోవైపు అమ్మ మరణం అనంతరం ఆమె సన్నిహితురాలు శశికళ, ఆమె బంధువులు జైలుకు వెళ్లడంతో గత ఐదు నెలలుగా ఈ భవనం ఆలనాపాలనా చూసిన వారు లేకుండాపోయారు. దీనితో ప్రస్తుతం ఈ భవనం దెయ్యాల కొంపను తలపిస్తోంది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ప్రైవేటు ఏజెన్సీలకు చెందిన సెక్యూరిటీ గార్డులు గార్డు రూమ్ దాటి లోపలికి వెళ్లే సాహసం చేయలేకపోతున్నారని తమిళనాడు మీడియా విశ్లేషించింది. ఈ వార్తలతో తమిళనాడులోని అమ్మ అభిమానులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/