జ‌య‌ల‌లిత..విష్ణుమూర్తి 11వ అవ‌తార‌మ‌ట‌!

Update: 2017-06-15 11:54 GMT
తమిళనాడు దివంగత సీఎం జయలలిత అంటే త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్య‌క్ష దైవంతో స‌మానం. ఇక పుర‌చ్చి త‌లైవి అంటే అన్నా డీఎంకే నేతలకు ఎంతటి వీరాభిమానమో చెప్పక్కర్లేదు. అమ్మ ద‌ర్శ‌న‌మైతే చాల‌నుకొని ఆమెకు సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తారు. అమ్మంటే వారికి న‌డ‌యాడే దైవం.

త‌మిళ రాజ‌కీయాల్లో వ్య‌క్తిపూజ‌కు అధిక ప్రాధాన్య‌మిస్తారు. అయితే, కొన్ని సార్లు అది హ‌ద్దులు దాటుతోంది. తాజాగా అన్నాడీఎంకె పార్టీ ఎమ్మెల్యే ఒకరు జయలలితను విష్ణువు 11వ అవతారంగా అభివర్ణించడ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

తమిళనాడులో అసెంబ్లీ సమావేశాలు జ‌రుగుతున్నాయి. వాటిలో  భాగంగా గురువారం నాటి సభలో మరియప్పన్ కెన్నడీ అనే ఎమ్మెల్యే ఈ వ్యాఖ్య‌లు చేశారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో అమ్మ‌ గురించి పదేపదే ప్రస్తావించారు. అంత‌టితో ఆగ‌కుండా ఆమెను విష్ణువు అవతారంగా అభివ‌ర్ణించారు.

అంతేకాదు, ప్రస్తుతం అమ్మ  స్థానంలో చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌ ఉన్నారని సెల‌విచ్చారు.దినకరన్ కూడా తమకు వెలుగుచూపించే మార్గ‌ద‌ర్శిలాంటి వాడని మరియప్పన్ చెప్ప‌డం విశేషం.

ఈ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాల‌ని డిమాండ్ చేశాయి. అన్నాడీఎంకె ఎన్నికల గుర్తు 'రెండాకుల' కోసం పన్నీర్, పళనిస్వామి వర్గాలు ఎన్నికల సంఘానికి బుధ‌వారం అఫిడవిట్లు దాఖలు చేశాయి. ఈ నేపథ్యంలో మరియప్పన్  వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News