ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా పరిశ్రమలను నెలకొల్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకుని తిరుగుతుంటే... టీడీపీకే చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం పట్టుబట్టి ఓ పరిశ్రమను మూయిస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి, ఆయన సోదరుడు తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకరరెడ్డి ఈ పుణ్యం కట్టుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
తాడిపత్రి ప్రాంతంలో ఎక్కడ ఏ చిన్న ఉద్యమం లేదా నిరసన జరిగిన జెసి సోదరులు వాటిని అడ్డుకుని పారిశ్రామిక వర్గాలకు ఇబ్బందులు లేకుండా చూసేవారని చెబుతుంటారు... కానీ ఇప్పుడు మాత్రం అల్ట్రా టెక్ సిమెంటు కర్మాగారం విషయంలో వారు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారం వద్ద భూములు కోల్పోయినవారికి ఉద్యోగాలు ఇవ్వాలని,కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని,స్థానికులకు కాంట్రాక్టు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారే ఆందోళన చేయిస్తున్నారని చెబుతున్నారు. టిడిపి నాయకులు ,కార్యకర్తలు షిఫ్టలు వారీగా పరిశ్రమ వద్ద పనులు జరగకుండా గేట్లుబంద్ చేయిస్తున్నారట. దీంతో అల్ట్రాటెక్ పరిశ్రమ తొమ్మిది రోజులగా మూతపడింది.
అల్ట్రాటెక్ మూతపడితే ప్రత్యక్షంగా,పరోక్షంగా పదివేల మంది ఉద్యోగులకు ఉపాది లేకుండా పోతుందని వామపక్ష నేతలు అంటున్నారు. జేసీ సోదరులకు అల్ట్రాటెక్ యాజమాన్యంతో కుదరకపోవడంతోనే వారు ఈ పనిచేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిగతా పరిశ్రమల్లో ఇలాంటి సమస్యలే ఉన్నా వారు అల్ట్రాటెక్ నే టార్గెట్ చేశారంటున్నారు.